Rekha:ఆరుగురితో ఎఫైర్లు.. రెండు పెళ్లిళ్లు చివరకు ఒంటరిగా రూ.100 కోట్ల ఇంట్లో..!
షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్, సల్మాన్ ఖాన్ బ్యాచిలర్ ప్యాడ్ గెలాక్సీ మధ్య 100 కోట్ల ఖరీదైన విలాసవంతమైన ఒక ఇల్లు ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన, ఖరీదైన స్థిరాస్తి. అయితే ఇది ఎవరిది? అంటే.. లెజెండరీ నటి రేఖకు చెందినది. ప్రస్తుతానికి రేఖ నికర ఆస్తుల విలువ రూ. 332 కోట్లుగా అంచనా. తన ఆస్తులలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ పెట్టుబడులే. బసేరా భవంతి విలువ 100 కోట్లు. చాలా సంవత్సరాలుగా సినిమాల్లో నటించని రేఖ ప్రస్తుత ఏ-లిస్టర్లలో సగం మంది కంటే ఉత్తమంగా ఆర్జిస్తోంది.
బసేరాలో ఎంత మంది నివసిస్తున్నారు? అంటే ఈ ఇంటిలో నటి రేఖ మాత్రమే నివశిస్తారు. దీని విలువ వంద కోట్లు ఉంటుందా? అంటే కచ్ఛితంగా ఉంటుంది. అరేబియా సముద్రం ఎదుట సెలబ్రిటీలతో నిండి ఉన్న విలాసవంతమైన ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది గనుక దీని విలువ భారీగా పెరిగింది. ఒకప్పటి రాజకోటను తలపించే ఈ ఇంటి వెల దశాబ్ధాలుగా పెరుగుతూనే ఉంది. బసేరా సీఫేసింగ్ లో ఉండటంతో, పెద్ద కిటికీలు సముద్రపు గాలిని సంగ్రహిస్తాయి. ఈ ఇంటి లోపల నిర్మాణ శైలి నిస్సందేహంగా రాజరికాన్ని తలపిస్తుంది. ముదురు చెక్క శిల్పాలు, ఇత్తడి పొదిగిన ఫర్నిచర్, చేనేత వస్త్రాలు, పురాతన అద్దాలు వంటివి డ్రమటిగ్గా కనిపిస్తాయి. దక్షిణ భారత శాస్త్రీయ అంశాలను మిళితం చేసిన నవాబీ అలంకరణతో ఆకర్షిస్తాయి. ప్రతి గదికి ఒక పీరియడ్ ఫిల్మ్ సెట్ ప్రధన ఆకర్షణ. `బసేరా`లోని తోట కేవలం పచ్చిక బయలు మాత్రమే కాదు.. ఆమె కథలోని ఒక పాత్ర. వెదురు గోడలు ..దట్టమైన ఆకులతో చుట్టిన.. వృక్షజాల కోటను తలపిస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి వెళ్లి ముంబైలో స్థిరపడిన నటి రేఖ. అక్కడ పరిశ్రమలో అగ్ర నటిగా ఏలారు. ఇండస్ట్రీ లెజెండరీ నటులతో కలిసి పని చేసారు. 70 ఏళ్ల వయసులోను రేఖ నేటితరంతో పోటీపడుతూ ఫ్యాషనిస్టాగా వెలిగిపోవడం చర్చగా మారుతోంది.
రేఖ జీవితంలో చాలా విషాదం జరిగింది. పెళ్లయిన 6 నెలలకే రేఖ భర్త ముఖేష్ అగర్వాల్ అనుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో రేఖ పై చాల ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది ఆమెను విమర్శించారు. అలాగే రేఖ గురించి దారుణంగా మాట్లాడారు. ముఖేష్ చనిపోడానికి రేఖ కారణం అంటూ నిందలు వేశారు.. అవమానించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ.. షాకింగ్ విషయం చెప్పింది. ముఖేష్ రేఖ నుంచి విడాకులు కోరుకున్నాడు. రేఖ మాత్రం తన భర్త నుంచి విడాకులు అడగలేదు. పెళ్లయ్యాక భర్త పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేనెప్పుడూ సంబంధాన్ని వదులుకోలేదు’ అని రేఖ చెప్పింది. అలాగే మేం లండన్‌లో హనీమూన్‌కి వెళ్లాం. అయితే ముఖేష్ రిలేషన్‌షిప్‌లో తేడా కనిపించిందని రేఖ తెలిపింది. ఆ తర్వాత రేఖ దివంగత నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకున్నట్లు సమాచారం. కానీ వినోద్ మెహ్రా తల్లి రేఖను కోడలిగా అంగీకరించలేదు. వీరి పెళ్ళికి అంగీకరించపోవడంతో.. వినోద్ మెహ్రా, రేఖ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ ఇద్దరూ తమ వివాహ బంధాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. అప్పటికే ఈ ఇద్దరి గురుంచి చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన కూడా మరణించారు. అయితే రేఖ ఇండస్ట్రీలో చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.