సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎంతో విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలది. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన ఎలాంటి స్టార్ హీరో అయినా ఆమెకు కథ నచ్చితేనే సినిమాలు చేస్తారు లేదంటే పక్కన ఎలాంటి స్టార్ హీరో అయినా నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోని ఈమె రిజెక్ట్ చేశారు అంటే ఆమె సినిమాల పరంగా ఎలా ఉంటారో స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇక సాయి పల్లవి వస్త్రధారణలో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు ఈమె ఎప్పుడు పొట్టి దుస్తుతులు ధరించకుండా సాంప్రదాయ దుస్తులలోనే కనిపిస్తూ ఉంటారు. ఇక సినిమాలలో కూడా ఎక్కడ గ్లామర్ షో అనేది ఉండదు. చాలా పద్ధతిగా ఈమె వస్త్రధారణ ఉంటుంది. అయితే అందరిలాగే సాయి పల్లవి ఎందుకు పొట్టి దుస్తులు వేసుకోదనే సందేహాలు చాలామందికి కలిగి ఉంటాయి. ఇలా సాయి పల్లవి పొట్టి దుస్తులు వేసుకోకపోవడానికి కూడా కారణం ఉందని తెలుస్తుంది.గతంలో తాను టాంగో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యిందని.అందులో తాను పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేయడంపై విమర్శలు వచ్చాయని తెలిపింది. అలా ఆ విమర్శలు చూసి నాకే ఎలాగో అనిపించింది అందుకే అప్పటి నుంచి పొట్టి దుస్తులు వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సాయి పల్లవి తెలిపారు. ఇక సాయి పల్లవి ఎంతో సాంప్రదాయమైన దుస్తులను వేసుకోవడం వల్ల ఆమె సినిమాలు సక్సెస్ కి కారణమని కూడా చెప్పాలి.ప్రతి ఒక్క సినిమాలో ఈమె ఎంతో నీటిగా దుస్తులు ధరిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ చేస్తేనే అవకాశాలు వస్తాయనే మాటలు నిజం కాదని సాయి పల్లవి నిరూపించారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి ఇటీవల నాగచైతన్య హీరోగా నటించిన తండెల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
సాయి పల్లవి సినీ ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన హీరోయిన్స్ కంటే భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన నటి.ఆమె ఎప్పుడూ సంప్రదాయ దుస్తులకే ప్రాధాన్యం ఇస్తుంది.గ్లామర్ షో లేకుండానే తన అద్భుతమైన నటనతోనే ప్రేక్షకులను మెప్పిస్తోంది.అందుకే అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.సాయి పల్లవి సినిమాల్లో పొట్టి దుస్తులు ధరించకపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.గతంలోఆమె టాంగో డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అయ్యింది.అందులో ఆమె పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేసింది.ఈ వీడియో చూసి కొంతమంది విమర్శలు చేశారు. గతంలో తాను టాంగో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యిందని.అందులో తాను పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేయడంపై విమర్శలు వచ్చాయని తెలిపింది.మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది సాయి పల్లవి. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా సంచలన విజయం సాధించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నిజానికి, మేకప్ లేకుండా సినిమాల్లో నటించడానికి ఇష్టపడే ఏకైక నటి ఆమె. మేకప్ లేకుండా కూడా ఆమె చాలా అందంగా కనిపిస్తుంది.సాయి పల్లవి తాజాగా ‘తండేల్’లో ప్యూర్ లవ్ స్టోరీని ఆడియెన్స్ కు చూపించిన విషయం తెలిసిందే. గతంలో ‘విరాటపర్వం’తో రెబలిస్ట్ గానూ మెరిసి ఆకట్టుకుంది.ఇక రెండోసారి అక్కినేని నాగచైతన్యతో కలిసి బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఓవైపు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.