సినీనటి సమంత గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాకపోయినా ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ఈమె తెలుగులో ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదే ఈమె చివరి చిత్రం ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ సినిమా మాత్రం చేయలేదు.
త్వరలోనే రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈమె కెరియర్ విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత ఒంటరిగానే ఉంటున్నారు అయితే ఈమె గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ నిడుమోరితో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం జరుగుతుంది.
నెల వ్యవధిలోనే ఏకంగా మూడు పార్టీలకు వీరిద్దరూ చాలా చనువుగా జంటగా హాజరు కావడంతో సమంత రాజ్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని ఏ క్షణమైనా ఈమె తన ప్రేమ విషయాన్ని బయట పెట్టవచ్చు అంటూ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే డైరెక్టర్ రాజ్ కు వివాహమైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలలో భాగంగా ఈమె చేతికి ఒక డైమండ్ రింగ్ కనిపించింది. ఇలా సమంత చేతి వేలికి రింగ్ కనిపించడంతో సమంత రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారా డైరెక్టర్ రాజ్ తోనే ఈమె నిశ్చితార్థం చేసుకున్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత గురించి వస్తున్న ఈ వార్తలలో నిజం ఎంతవరకు ఉంది అనేది తెలియాలి అంటే సమంత రియాక్ట్ అవ్వాల్సిందే.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలో డైమండ్ రింగ్ కనిపించడంతో, అభిమానుల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఈ ఫొటో వైరల్ అవడంతో, రాజ్ నిడిమోరుతో ఆమె సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుందనే పుకార్లు ఊపందుకున్నాయి.
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత కూడా ప్రొఫెషనల్ గా ముందుకు సాగుతూ సినిమాలు, వెబ్ సిరీస్ లలో బిజీగా మారారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సక్సెస్ తర్వాత, హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’లో సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు రాజ్ & డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ లో ఉన్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరు పికిల్ బాల్ టోర్నమెంట్ లో కలిసి పాల్గొనడం, పార్టీలకు కలిసి హాజరవడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలో ఆమె చేతి వేలికి డైమండ్ రింగ్ కనిపించడంతో, నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. అభిమానులు ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని భావిస్తూ, రాజ్ నిడిమోరుతో ఆమె గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకుందనే ఊహాగానాలు చేస్తున్నారు.