అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం నుంచి కెమెరాకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యూటీ సమంత మళ్లీ ఇప్పుడిప్పుడే వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతుంది. సినిమాల కంటే వెబ్ సిరీస్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రొఫెషనల్ విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్ విశేషాలను కూడా పంచుకునే సమంత.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మూడు రోజుల పాటు ఫోన్ లేకుండా ఒంటరి జీవితాన్ని గడిపిన అనుభవాలు సమంత తన ఫాలోవర్స్ తో పంచుకుంది. `మూడు రోజులు సైలెంట్ గా ఉన్నాను. ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా భయంకరంగా అనిపించింది. కానీ ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను. మిలియన్ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇది ప్రయత్నించండి` అంటూ సమంత పోస్ట్ పెట్టగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
కాగా, సమంత పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చైతు శోభితను వివాహం చేసుకోగా.. సమంత సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. `సిటడెల్: హనీ బన్నీ` వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉన్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ సమంత మాత్రం ఈ విషయంపై ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సామ్ `రక్త్ బ్రహ్మాండ్` అనే సిరీస్ లో యాక్ట్ చేస్తోంది.