‘ఏ మాయ చేసావే’ సినిమాతో సమంత.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది సామ్. అయితే నాగచైతన్యతో సామ్ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తరచూ ఆమెకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇక నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ భామ.. హిందీలో, హాలీవుడ్ లో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాని గత కొంత కాలంగా సమంత .. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సామ్- రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్‌లో కనిపించారు. ఆ కార్యక్రమంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉండడం ఫుల్ హాట్ టాపిక్ అయ్యింది.
అలాగే సమంత ఇండస్ట్రీలోకి వచ్చే 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో పార్టీ ఇచ్చారు. ఆ వేడుకల్లో సైతం రాజ్ కనిపించారు. దాంతో వారిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత నటించింది. ఆ సినిమాలో ఆమె చేసిన బొల్డ్ పాత్ర కారణంగానే నాగ చైతన్యకు – ఆమెకు మనస్పర్ధలు వచ్చాయని అంతా అనుకున్నారు.
రీసెంట్ గా వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడేల్ – హనీ – బన్నీ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ అండ్ డీకేనే దర్శకత్వం వహించారు. దాంతో వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారని భావిస్తున్నారు. త్వరలోనే వీరి ప్రేమ విషయం అధికారికంగా వెల్లడించనున్నారని ప్రచారం జరుగుతోంది. రాజ్ నిడిమోర్‌తో బాలీవుడ్ లో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. ఆయన స్వస్థలం ఏపీలోని తిరుపతి. దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు కాబోతున్నారని అంటున్నారు.
ఇక సామ్ తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్: హనీ బన్నీ అనే యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటించింది. సమంత ప్రస్తుతం “రక్త బ్రహ్మాండ్” వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాతగా మారిన సామ్ ‘ట్రలాలా’ పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు కూడా రిలీజ్ అయ్యింది ఈ మూవీ.