వైఎస్సార్సీపీ హయాంలో ముంబయి నటి కాదంబరీ జెత్వానీపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో అరెస్ట్ చేసిన ఆయణ్ను విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఆయన ఈ నటి కేసులో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు.
ఇక హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఐడి కార్యాలయానికి తీసుకువచ్చిన అధికారులు ఈ కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. పీఎస్‌ఆర్‌తో పాటు సీఐడీ పోలీసులు పలు కీలకపత్రాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వాటి ఆధారంగా ఆయణ్ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, ఐపీఎస్ విశాల్ గున్నితో పాటు ఆంజనేయలు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ1గా ఉండగా.. ఐపీఎస్ ఆంజనేయులును పోలీసులు ఏ2గా చేర్చారు.
వైఎస్సార్సీపీ హయాంలో ముంబయి నటిపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో పీఎస్సార్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. జగన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఆంజనేయులును హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ కేసులో ఆయన్ను సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. పీఎస్‌ఆర్‌తో పాటు పలు కీలకపత్రాలను సీఐడీ పోలీసులు వెంట తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నకేఆర్ సూర్యనారాయణను తుపాకితో బెదిరించారని పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై గుంటూరు సీఐడీ పీఎస్‌లో మరో కేసు నమోదయ్యింది.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పీఎస్‌ఆర్ ఇంటి వద్ద సోమవారం సీఐడీ పోలీసులు పరిశీలించారు. దీన్ని గమనించిన పీఎస్‌ఆర్ బేగంపేటలోని ఆయన వియ్యంకుడి ఇంటికెళ్లారు. ఉదయం 5 గంటలకు ఆంజనేయులును సీఐడీ అరెస్టు చేసింది. అక్కడి నుంచి మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు పీఎస్‌ఆర్‌ను తీసుకెళ్లి సోదాలు నిర్వహించారు. తదనంతరం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సీతారామాంజనేయులును ఏపీకి తరలించారు. ఈ కేసులో ఆయన్ను పూర్తి స్థాయిలో సీఐడీ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. విజయవాడ మాజీ సీపీ కాంతిరాణాటాటా, ఐపీఎస్ విశాల్ గున్నితో పాటు ఆంజనేయలు సస్పెన్షన్‌లో ఉన్నారు.
సస్పెన్షన్‌లో ఉన్నా వైఎస్సార్సీపీ అంటకాగుతున్నారని ఆంజనేయులుపై ఆరోపణలున్నాయి. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల్లో నిందితులు తప్పించుకునే విధంగా పీఎస్సార్ సలహాలు ఇస్తున్నారనే ప్రచారం పోలీసు శాఖలోనే బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అక్రమాల నిందితులు నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారీలో ఉంటే ఆచూకీ దొరక్కుండా ఎలా జాగ్రత్తపడాలి లాంటి సలహాలు, సూచనలు ఇస్తూ ఆంజనేయులు తన స్వామిభక్తి చాటుకుంటూ వస్తున్నారని ఇటీవల పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.ఈ తప్పుడు కేసులో తనతోపాటు తన తల్లిదండ్రులను జైలు పాల్జేశారని ముంబయి నటి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసులపై, కుక్కల విద్యాసాగర్‌పై 2024 ఆగస్టులో ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదుపై విద్యాసాగర్‌తో పాటు ముగ్గురు ఐపీఎస్‌లపై విజయవాడలో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ1గా విద్యాసాగర్, ఏ2గా పి. సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్), ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్ పూర్వ ఏసీపీ హనుమంతురావు, ఏ5గా ఇబ్రహీంపట్నం పూర్వ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లను పోలీసులు చేర్చారు. విద్యాసాగర్‌తో అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్‌గున్నీ వైస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో కుమ్మక్కై కాదంబరీ జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తన ఆస్తిపై జత్వానీ తప్పుడు ఒప్పంద పత్రాన్ని సృష్టించి, ఇతరులకు విక్రయించినట్లు 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు పెట్టారు. అయితే ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా సీతారామాంజనేయులుగా తేలింది. ముఖ్య నేత చెప్పగానే రంగంలోకి దిగిన పీఎస్‌ఆర్, కాదంబరిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో ఆయనే చూసుకున్నారు. దీంతో పీఎస్‌ఆర్‌తో పాటు కాంతిరాణా, విశాల్ గున్నీ, స్థానిక దర్యాప్తు అధికారి వరకూ అందరిపైనా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది.ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నమోదు చేసి, అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి. సీతారామాంజనేయులును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ అరెస్ట్‌పై జత్వానీ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ముంబైలో ఓ పారిశ్రామికవేత్తపై (సజ్జన్ జిందాల్) నటి జత్వానీ పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెపై, ఆమె కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు బనాయించారని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే కొందరు అధికారులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్ట్ చేశారని తెలిపారు. బాధితులను 50 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధించారని, వారి ఆస్తులను అటాచ్ చేసి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని, పాస్‌పోర్టులు సీజ్ చేసి, విదేశాల్లో ఉన్న సోదరుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని వివరించారు.
ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి అడిషనల్ ఎస్పీ విశాల్ గున్నిని సీతారామాంజనేయులు ఆదేశించారని, తన విశాఖపట్నం బదిలీ నిలుపుదల కోసం ఈ పని పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చారని గున్నినే స్వయంగా విచారణలో వెల్లడించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఈ కుట్రకు సంబంధించిన చర్చలు జరిగాయని గున్ని చెప్పినట్లు తెలిపారు. ఐపీఎస్ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై సమగ్ర విచారణ జరిపి, అసలు సూత్రధారులను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఐపీఎస్ అధికారులకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆయన కోరారు. సీతారామాంజనేయులు అరెస్ట్‌తోనైనా బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాలని శ్రీనివాస్ ఆకాంక్షించారు.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో మాజీ ఇంటెలిజన్స్ ఛీఫ్, ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయుల్ని పోలీసులు అరెస్టు సంచలనంగా మారింది. ఇవాళ హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీతారామాంజనేయుల్ని పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నారు. జెత్వానీ కేసులో పీఎస్సార్ ఆంజనేయుల్ని అరెస్టు చేయకుండా వదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్న వేళ ఇవాళ చోటు చేసుకున్న పరిణామం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు స్పందిస్తున్నారు.ఇదే క్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఉదయం 9 గంటలకు టీవీల్లో ఓ శుభవార్త విన్నానని రఘురామ తెలిపారు. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పీసీబీ అధికారిగా, ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా అనైతిక కార్యక్రమాల్లో జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వ్యక్తిగా సార్ధక నామథేయుడిగా పీఎస్సార్ ఉన్నారని రఘురామ తెలిపారు. ముందుగా తనపై దాడి, ఆ తర్వాత జత్వానీ కేసుల్లో పీఎస్సార్ కీలకంగా ఉన్నారన్నారు.
తనపై దాడి చేసిన కేసులో పీఎస్సార్ ఏ2గా ఉన్నారని, పీఎస్సార్ వ్యహకర్త అని, పీవీ సునీల్ కుడా వెధవ పనులు చేయడంలో ముందుంటాడన్నారు. వీరిద్దరూ తనపై దాడికి వ్యూహరచన చేశారన్నారు ఇప్పుడు జత్వానీ కేసులో సీతారామాంజనేయుల్ని అరెస్టు చేశారన్నారు. అరెస్టు చేసినప్పుడు రఘురామ కేసులోనూ ఆయన ఏ2గా ఉన్నారని అంతా చెప్తున్నారన్నారు. పీఎస్సార్ అరెస్టు తర్వాత చాలా మంది తనకు ఫోన్ చేసి మీ కేసు ఎంతవరకూ వచ్చిందని అడుగుతున్నారని రఘురామ తెలిపారు.పీఎస్సార్ ఆంజనేయుల అరెస్టు తరహాలోనే తన కేసులో మరో ఐపీఎస్ పీవీ సునీల్ ను కూడా అరెస్టు చేస్తారా అని రఘురామ ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఆయన్ను కనీసం విచారణకు పిలవలేదన్నారు. దెబ్బలు తిన్న తనలాంటి వాడు కనీసం మారుతీ 800 కారు వేగంతో విచారణ జరుగుతుందని ఆశిస్తారన్నారు. కానీ రోడ్డు రోలర్ గా ఈ విచారణ సాగుతోందన్నారు. ఓసారి విచారణ వేగం పుంజుకుంటే ఇక ఆగదని తాను నమ్ముతూ వస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్ పై నా స్పందన… pic.twitter.com/7gQp53TA3E
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) April 22, 2025