ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు.. టీ కప్పులో తుఫాను లాగా మారిపోతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉండే నేతలు కూడా తిరుగుబాట్లు మొదలు పెడుతున్నట్లు కనిపిస్తోంది. తిరుపాల్ రెడ్డి శివ తిరుగుబాటు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని వాటిని కూడా భరించలేక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నామని కేతిరెడ్డి తిరుపాల్ రెడ్డి మంజుల శివా తెలియజేశారు. అందుకు సంబంధించి పార్టీ పదవులకు సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేసి తమ రాజీనామా పత్రాలు కూడా అధిష్టాననికి పంపినట్లుగా తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీలో కష్టపడి నాయకులకు విలువ లేకుండా పోతుందని. 2024 ఎన్నికలలో ప్రత్యర్థ్యుల నుండి మా మీద చాలా ఒత్తిడి వచ్చినా కూడా ఏమాత్రం బెదరకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల పట్టణంలో ఏజెంట్గా కూర్చొని మరి చేసామని ఇందుకు మాజీ మంత్రి వివేక సతీమణి భార్య సౌభాగ్యమే సాక్ష్యం అంటూ తెలియజేశారు. మేము శక్తి మేరకు నిలబడి గట్టిగానే పోరాటం చేసాము.. అందువల్లే 2024 ఎన్నికలలో పదివేల ఓట్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి అంకితభావంతో సేవలందించిన కూడా కాంగ్రెస్ పార్టీ తలపెట్టి ప్రతి కార్యక్రమంలో ముందు ఉన్నాము.. ఒకరిద్దరూ చెప్పేటువంటి స్వార్ధపరులు మాటలు విని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మమ్మల్ని పక్కన పెట్టారని తెలిపారు. ఇది తమను చాలా బాధించిందని ఈ రోజున పులివెందుల ప్రాంతంలో ఈదురు గాలుల వల్ల భారీ నష్టం జరిగింది వేల ఎకరాల ఉద్యాన పంటల వల్ల రైతులు చాలా నష్టపోయారని రైతులను పరామర్శించేందుకు షర్మిల రెడ్డి జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతులు రావట్లేదు. ఈ విషయం పైన కూడా అటు రైతులు కూడా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారంటూ తెలిపారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కనీసం వీరిని పలకరించేందుకు కూడా వీరికి తీరిక లేదా అంటూ రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటు తెలుపుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీపై రైతులకు అసంతృప్తి ఏర్పడింది.. పదవులన్నీ కూడా ఇతరులకు ఇచ్చి మాలాంటి వాళ్లకు అన్యాయం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీని వీడుతున్నామంటూ తెలిపారు కేతిరెడ్డి తిరుపాల్ రెడ్డి మంజుల శివా. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏపీలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండడం కూడా కష్టమే అనిపించేలా ఉన్నది.