ఒత్తిడి అనేది సవాళ్లకు స్పందించడానికి శరీరాన్ని సిద్ధం చేసే సహజ ప్రతిస్పందన.ఇది రాబోయే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సిద్ధం చేసే హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది.స్వల్పకాల ఒత్తిడి పనిపై శ్రద్ధను పెంచుతుంది, పనితీరును మెరుగుపరుస్తుంది.అయితే, దీర్ఘకాలికంగా ఒత్తిడి కొనసాగితే ఆందోళన, గుండె జబ్బులు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ తెలిపింది.సాధారణంగా ఆఫీసు, ఫ్యాక్టరీల్లో పనులు, ఆర్ధిక విషయాలు, వ్యక్తిగత బంధాలు మనిషిలో ఒత్తిడిని తీసుకు వచ్చే అంశాలు. మనలో చాలామంది తరచూ వాటి ఎదుర్కొంటూ ఉంటాం.అయితే, మనం ఎంతసేపు ఒత్తిడి ఎదుర్కొంటున్నాం అనేది ముఖ్యమైన విషయం.”స్వల్పకాలిక ఒత్తిడిలో అడ్రినలిన్, కార్టిసాల్ హార్మోన్లు విడుదలై ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. పనిపై శ్రద్ధగా దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థకు తాత్కాలిక శక్తిలా పనిచేస్తాయి.” అని బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ కౌన్సెలింగ్ అండ్ సైకోథెరపీ (BACP) సభ్యురాలు, మానసిక చికిత్స వైద్యురాలు రాచెల్ వోరా చెప్పారు.
ఎక్కువ కాలం కొనసాగితే, ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయి పెరిగి గుండె జబ్బులు, రోగ నిరోధక శక్తి బలహీనపడడం, ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS), అల్సర్లు వంటి జీర్ణ సమస్యలకు కారణమవుతుందని వోరా వివరించారు.అది ఎక్కువసేపు ఉంటే ఆందోళన, నిరాశ, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, నిద్ర రాకపోవడం, వేగంగా వృద్ధాప్యం రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అంటే క్రమంగా శారీరక వ్యవస్థ దెబ్బతింటుంది.ఎక్కువసేపు ఒత్తిడి వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతాయి. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం కండరాల్లో వేగంగా ప్రవహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.ఇటువంటి సవాళ్లను ఎదుర్కొవడానికి శరీరం వెంటనే స్పందిస్తుంది. దీంతో జీర్ణక్రియ, రోగ నిరోధక పనితీరు మందగిస్తుంది.కార్టిసాల్ స్థాయిలు పెరగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది, బరువు పెరుగుతారు. స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.సరిగా నిద్ర కూడా పట్టకపోవచ్చు. సరైన నిద్ర లేకపోతే శరీరం తనను తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది.‘‘ప్రతికూలతలను, సవాళ్లను అనుకూలంగా మార్చుకోగలిగే శక్తి అనేది మీకు ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. కానీ, ఇదొక నైపుణ్యం, కాలనుగుణంగా మీలో అది అభివృద్ధి చెందుతుంది.” అని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని అసిస్టెంట్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ గోల్నాజ్ తబిబ్నియా చెప్పారు. ఆ సవాళ్లను తప్పించుకోవడం కంటే చురుకుగా వాటితో పోరాడటం వల్ల, మీలో ఆత్మస్థైర్యం, శక్తి పెరుగుతుందని ఆమె అన్నారు.ఒత్తిడిని ప్రజలు హానికరంగా కంటే ప్రయోజనకరంగా చూడాలని డాక్టర్ తబిబ్నియా అన్నారు. దీనివల్ల, వారి మానసిక ఒత్తిడి స్పందనలు తగ్గిపోతాయని తెలిపారు. ఆలోచన ధోరణి అనేది చాలా బాగా పనిచేస్తుందని, ఆందోళనను తగ్గించి, పనితీరును మెరుగుపరుస్తుందని వివరించారు.”ఒత్తిడిని తప్పించుకోవడం కంటే తరచూ దానితో కలిసి పోరాడటం వల్ల, రాబోయే ఒత్తిళ్లను తట్టుకునేలా మీ మెదడుకు మరమ్మతులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు జిమ్‌లో బరువును ఎత్తడం మీకు ఒత్తిడి అనిపించవచ్చు. కానీ, అది మిమ్మల్ని మరింత బలంగా మార్చుతుంది.’’ఒత్తిడికి, ఆందోళనకు మధ్య తేడాలను యాంగ్జైటీ డిజార్డర్లపై ప్రజలకు సాయం చేస్తున్న యాంగ్జైటీ ప్రశ్నించింది.
ఒత్తిడి అనేది బహిరంగ పరిస్థితికి ప్రతిస్పందన. అంటే, గడువు లోపల పని పూర్తి చేయడం, డ్రైవింగ్ టెస్టుకు వెళ్లడం, ఎగ్జామ్ రాయడం వంటి వాటికి మీ శరీరం స్పందించే తీరు. ఆ పని పూర్తయిన తర్వాత, అది ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది.ఆందోళన అనేది..నిర్దిష్టమైన కారణం లేకుండా కలిగే పరిస్థితి. ఒత్తిడి అనేది సహజమైన భావోద్వేగం, ఇది ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరిస్తూ సాయపడుతుంది. కానీ, నిత్యం అధికంగా లేదా నిరంతరాయంగా ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రం అది సమస్యాత్మకంగా మారుతుంది.ఒత్తిడి, ఆందోళన రెండూ నరాల వ్యవస్థను చురుకుగా మార్చి, ‘ఫైట్ ఆర్ ఫ్లయిట్’ స్పందనలకు బాధ్యత వహిస్తాయి. ప్రమాదాలకు స్పందించేలా శక్తిని ఇస్తూ.. అప్రమత్తతను పెంచుతాయి.వీటి వల్ల, కొన్నిసార్లు గుండె రేటు పెరగడం, చెమటలు పట్టడం, వణుకు రావడం వంటివి జరగొచ్చు.ఒత్తిడి వల్ల శరీరంపై హానికరమైన ప్రభావాన్ని తగ్గించేందుకు ఏం చేయాలో ఒక అకాడమిక్ రీసెర్చ్ వివరించింది.ఫిజికల్ ఎక్సర్‌సైజులు స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి, మనసును తేలికపరుస్తాయని ఈ రీసర్చ్ గుర్తించింది. ధ్యానం మానసిక ప్రశాంతతకు సాయపడుతుంది. భావోద్వేగ శక్తిని పెంచేందుకు సామాజిక మద్దతు చాలా కీలకమని పరిశోధన సూచించింది.ఒత్తిడి మన జీవితంలో విడదీయరాని భాగం. కానీ, ఇది కలిగించే బాధ కాదని నిపుణులు అన్నారు.ఒత్తిడిని పెంచే మనస్తత్వాన్ని అవలంభించే ప్రజలు మెరుగైన పనితీరును, ఎమోషనల్ వెల్‌బీయింగ్‌ను పొందుతారని అధ్యయనాలు గుర్తించాయి.ఒత్తిడిని ప్రమాదకరంగా కాకుండా సవాలుగా మార్చుకోవడం వల్ల, మీ శరీరంపై ఇది చూపే ప్రభావాన్ని గణనీయంగా మార్చుకోవచ్చని హార్వర్డ్ బిజినెస్ రివ్యూకు చెందిన రీసెర్చ్ చెప్పింది.”ఒత్తిడిని ప్రమాదకరంగా కాకుండా ప్రయోజనకారిగా ప్రజలు చూసినప్పుడు, వారి మానసిక ఒత్తిడి ప్రతిస్పందన కూడా తగ్గుతుంది.” అని డాక్టర్ తబిబ్నియా చెప్పారు.ఒత్తిడి గురించి వారు ఆలోచించే ధోరణిని మార్చుకోవడం ద్వారా వ్యక్తిగత వృద్ధి, శక్తికి సవాళ్లను కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చు