సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు కల్పన తాను ఆత్మహత్యకు పాల్పడ లేదని పోలీసులకు తెలిపారు. తన కూతురితో జరిగిన గొడవ కారణంగా నిద్ర మాత్రలు మోతాదు మించి వేసుకున్నాను అని ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్ఫష్టం చేసింది. కెపిహెచ్‌బి పోలీసులు దీనిపై ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
కల్పన తన భర్తలో కలిసి ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని విల్లాలో ఉంటున్నారని.. ఆమె కుమార్తెని కూడా హైదరాబాద్‌కు వచ్చి చదువుకోవాలని కోరగా.. ఆమె అందుకు నిరాకరించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ఇద్దరికి మనస్పర్ధలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఈ బాధతోనే కల్పన మోతాదుకు మించి నిద్ర మాత్రలు వేసుకున్నారని స్ఫష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదని కల్పన వెల్లడించారని పేర్కొన్నారు.
కాగా, ఈ విషయంపై కల్పన కుమార్తె కూడా ఉదయం మీడియాతో మాట్లాడారు. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని.. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆమె కోరారు.
సింగర్ కల్పన సూసైడ్ అంశం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దుమారంగా మారింది. రెండు రోజుల వరకు తమతో బాగా మాట్లాడారని కేపీహెచ్ బీ అపార్ట్ మెంట్ వాసులు సైతం ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నిన్న అపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనను పోలీసులు స్థానికంగా ఉన్నహోలిస్టిక్ ఆసుపత్రిలో తీసుకెళ్లారు. ఆమెకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
సింగర్ కల్పన నిన్న.. జోల్ ఫ్రెష్ అనే నిద్ర మాత్రల్ని వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. కల్పనకు ఆమె భర్త ప్రసాద్ మంగళవారం ఫోన్ చేశారని కల్పన పోన్ తీయకపోవడంతో వెంటనే అపార్ట్ మెంట్ సెక్యురిటీకా కాల్ చేశారు. దీంతో అపార్ట్ మెంట్ వాసులు కల్పన ఉంటున్న ఇంటి డోర్ బెల్ కొట్టిన ఆమె తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు డోర్ లాక్ పగల కొట్టి బెడ్ మీద అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కల్పనకు వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి మరీ చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియగానే.. కల్పన భర్త, ఆమె కూతురు హైదరబాద్ చేరుకున్నారు. అదే విధంగా ప్రముఖ సింగర్ లు.. సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు కల్పన భర్తతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. అందరు కూడా కల్పనకు.. ఆమె భర్తతో వివాదం ఉండొచ్చని అనుకున్నారు. కానీ అసలు కల్పనకు తన పెద్ద కూతురుతో వాగ్వాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో కల్పన పెద్ద కూతురు ఉంటుంది.
ఆమెను హైదరబాద్ కు వచ్చేయాలని కల్పన అడిగారంట. కానీ దీనికి కల్పన కూతురు అస్సలు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్ లోనే వాగ్వాదం జరిగిందంట. దీంతో ఈ ఒత్తిడితోనే కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజముందో కానీ.. కల్పన కొలుకున్న తర్వాత అసలు విషయాలన్ని వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు.