మలక్ పేట్ లో శిరీష మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శిరీషను ఆడపడుచు చంపిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు ఈ హత్య తర్వాత శిరీష భర్త వినయ్ తన సోదరికి సహకరించారని కూడా పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. మలక్ పేట్ జమునా టవర్స్ లో ఉంటున్న శిరీష అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే శిరీష మరణించిన విషయాన్ని ఆమె మేనమామకు ఫోన్ చేసిన వినయ్ గుండెపోటుతో చనిపోయిందని చెప్పగా, మృతదేహాన్ని కదిలించవద్దని, తాను వస్తున్నానని, చెప్పినా వినకుండా తమ సొంత గ్రామమైన దోమల పెంటకు తరలిస్తుండగా మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేసి వెనక్కు రప్పించారు.
శిరీష్ దేహంపై గాయాలుండంతో పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు ఆమెకు ఊపిరి ఆడకుండా చేసినందునే మరణించినట్లు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. శిరీషను ఆమె భర్త సోదరి మత్తు మందు ఇచ్చి ఊపిరి ఆడకుండా హత్య చేసిందని పోలీసులు దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శిరీష తన చిన్న నాటే తల్లిదండ్రులు మరణించడంతో వినయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. శిరీషను ఒక ప్రొఫెసర్ పెంచుకుంటున్నారు. అయితే ప్రొఫెసర్ కు ఈ ప్రేమ వివాహం ఇష్టం లేకపోయినా చేసుకోకపోవడంతో వారు ఇక శిరీష ను గురించి పట్టించుకోవడం లేదు. అయితే గత కొంతకాలంగా ఆడపడచు, శిరీషల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
అయితే ఇందుకు కారణాలు ఏవనేవి బయటకు చెప్పకపోయినా భర్త వినయ్ కు శిరీష పై అనుమానం కూడా ఉండటంతో తరచూ ఆమెను వేధిస్తుండేవారని పోలీసులు తెలిపారు. కానీ ఆడపడుచుతో ఏర్పడిన విభేదాల వల్ల ఆమె శిరీషను మత్తు మందు ఇచ్చి ఊపిరి ఆడకుండా చేసిందని వైద్యులు తెలిపారు. మేనమామ ఇచ్చిన ఫిర్యాదుతో శిరీష భర్త వినయ్ తో పాటు వినయ్ సోదరిని కూడా పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి తమ దైన స్టయిల్ లో విచారించగా అసలు విషయం బయటకు వచ్చిందని అంటున్నారు. మొత్తం మీద శిరీషపై అనుమానం, ఆడపడుచు ప్రతీకారం వెరసి ఆమె మరణానికి కారణమయ్యాయని పోలీసులు మీడియాకు వివరించారు.
హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. శిరీషకు మత్తుమందు ఇచ్చి చంపిన భర్త, ఆయన సోదరి చంపినట్లు పోలీసులు గుర్తించారు. భర్త వినయ్‌తో పాటు సోదరి సరితను పోలీసులు అరెస్టు చేశారు. సరిత అక్రమ సంబంధం బయట పెట్టినందుకే శిరీషను హత్య చేసినట్లు తెలుస్తోంది. తన అక్రమ సంబంధం గురించి అందరికీ చెబుతోందని శిరీషతో సరిత గొడవ పడింది. కొద్ది నెలల క్రితం అమెరికా నుంచి వచ్చింది సరిత. ప్రస్తుతం ఒకే ఆస్పత్రిలో శిరీష, సరిత నర్సులుగా పనిచేస్తున్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటుండడంతో శిరీషకు సరిత మత్తుమందు ఇచ్చి చంపేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.
హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్ మాయం చేయాలనుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సరిత, వినయ్. శిరీష చనిపోయిన అనంతరం గుండెపోటు వచ్చిందంటూ శిరీష మేనమామకు వినయ్ ఫోన్ చేశాడు. తాను వచ్చేవరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని మేనమామ చెప్పాడు. శిరీష మేనమామ వచ్చేలోపే డెడ్ బాడీని తరలించడంతో అనుమానం వచ్చింది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్‌ని మేనమామ ట్రేస్ చేసి పట్టుకున్నారు. మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్లు.. హత్యగా ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. దీంతో అక్కను తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరుస గొడవల నేపథ్యంలో శిరీషను అంతమొందించాలనుకున్న ఆడపడుచు సరిత పథకం ప్రకారం శిరీష కుమార్తెను తల్లిదండ్రులతో స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు పంపించింది. గత నెల 27నే 28 నుంచి శిరీష విధులకు రాదంటూ ఆసుపత్రి సిబ్బందికి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో తొలుత ఆమెకు మత్తుమందు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం దిండుతో ఊపిరాడకుండా నొక్కిపట్టి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అసలు విషయం బయటికి పోక్కితే జైలు పాలవుతామని భావించిన శిరీష భర్త వినయ్ సహా కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా శిరీషకు ఛాతి నొప్పి వచ్చిందంటూ వినయ్ ఓ ఆసుపత్రిలో ఆస్పత్రిలో చేర్పించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
గుండెపోటు రావడంతో శిరీషను ఆసుపత్రిలో చేర్పించామని కడచూపు చూసుకునేందుకు ఆసుపత్రికి రావాలంటూ మృతురాలి అక్కకు సరిత ఫోన్ చేసింది. కంగారుపడ్డ ఆమె అదే విషయాన్ని నిజాంపేట్లో ఉండే మేనమామ మధుకర్కు చెప్పడంతో అతడు ఆసుపత్రికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాడు. తను వచ్చే వరకు మృతదేహాన్ని తరలించొద్దని కోరాడు. మృతదేహాన్ని మేనమామ చూస్తే శిరీష ఒంటిపై ఉన్న గాయాలు కనిపిస్తాయని అసలు విషయం బయటపడుతుందని నిందితులు భావించారు. ఈ క్రమంలోనే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని వినయ్ స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు తరలించి దహనం చేసి చేతులు దులుపుకోవాలనుకున్నారు.
శిరీష మేనమామ ఆసుపత్రికి చేరుకునేలోపే మృతదేహాన్ని అంబులెన్స్లో నాగర్ కర్నూల్ వైపు తరలించారు. అనుమానం వచ్చిన మృతురాలి మేనమామ పోలీసుల సహకారంతో అంబులెన్స్ ను తిరిగి వెనక్కి రప్పించారు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో అక్కడే ఉన్న శిరీష భర్త వినయ్, ఆడపడుచు సరితలను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.