మన చుట్టూ ఒక అదృశ్య ముప్పు ఉంది. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనీ మనం గమనించడం లేదు. గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్‌కు ఇది కారణమవుతోంది. జ్ఞాపకశక్తి కోల్పోవడానికీ ఇదీ ఒక కారణంగా అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఇంతకీ అదేంటో తెలుసా? శబ్దం.ఇది ప్రజారోగ్య సంక్షోభమని, ప్రతిరోజూ చాలామంది బాధితులవుతున్నారని లండన్ విశ్వవిద్యాలయంలోని సెయింట్ జార్జ్ ప్రొఫెసర్ షార్లెట్ క్లార్క్ అన్నారు అయినప్పటికీ, మనం ఈ శబ్ద తీవ్రత సమస్యను చాలా అరుదుగా చర్చిస్తాం.శబ్దం ఎప్పుడు హానికరంగా మారుతుందో అర్థం చేసుకోవడానికి, అనారోగ్యానికి గురైన వారితో మాట్లాడాను. ఎప్పుడూ శబ్దాలతో ధ్వనించే ఈ ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్వేషించాను.చాలా నిశ్శబ్దమైన సౌండ్ ల్యాబ్‌లో ప్రొఫెసర్ క్లార్క్‌ను కలవడం ద్వారా దీనిని ప్రారంభించా. నా శరీరం శబ్దానికి ఎలా స్పందిస్తుందో చూడటానికి మేం ప్లాన్ చేశాం. పెద్ద స్మార్ట్‌వాచ్‌ను పోలిన పరికరాన్ని ధరించాను. ఈ పరికరం నా హృదయ స్పందన రేటును, నా చర్మానికి ఎంత చెమట పడుతుందో కొలుస్తుంది. మీకు హెడ్‌ఫోన్‌లు ఉంటే మీరు ఇలా చేయవచ్చు, తెలుసుకోవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత శబ్దవంతమైన నగరంగా పేరుగాంచిన బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి వచ్చే ట్రాఫిక్ శబ్దం నాకు చిరాకు కలిగించింది. భారీ, ఒత్తిడితో కూడిన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నట్లు అనిపించింది. సెన్సార్లు నా ఆందోళనను గుర్తిస్తున్నాయి, నా హృదయ స్పందన రేటు పెరుగుతోంది, ఎక్కువగా చెమట పడుతోంది.’ట్రాఫిక్ శబ్దం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి’ అని ప్రొఫెసర్ క్లార్క్ తదుపరి శబ్దాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు చెప్పారు.ఆట స్థలం నుంచి వచ్చే సంతోషకరమైన ధ్వనులు మాత్రమే నా శరీరంపై శాంతపరిచే ప్రభావాన్ని చూపాయి. కానీ, కుక్కలు మొరిగే శబ్దాలు, రాత్రిపూట పొరుగువారు చేసుకొనే పార్టీ శబ్దాలు నన్ను ప్రతికూలంగా మార్చాయి.”శబ్దానికి మీ నుంచి భావోద్వేగ ప్రతిస్పందన ఉంటుంది” అని ప్రొఫెసర్ క్లార్క్ చెబుతున్నారు.
మీ చెవి ధ్వనిని గుర్తించి మెదడుకు పంపుతుంది. మెదడులోని ఒక భాగం అమిగ్డాలా, ధ్వనికి సంబంధించిన భావోద్వేగాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఇది శరీర సహజ రక్షణ వ్యవస్థలో భాగం, ప్రమాదాలకు త్వరగా స్పందించడానికి సహాయపడుతుంది”కాబట్టి మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. మీ నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. మీ శరీరం ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది” అని ప్రొఫెసర్ క్లార్క్ వివరించారు.ఇవన్నీ అత్యవసర పరిస్థితిలో సహాయపడతాయి, కానీ కాలక్రమేణా, ఇది శరీరానికి హాని కలిగించవచ్చు.
“మీరు చాలా ఏళ్లుగా అతి ధ్వనులకు గురైతే, మీ శరీరం ఈ విధంగానే స్పందిస్తూ ఉంటుంది. ఇది గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది” అని ప్రొఫెసర్ క్లార్క్ సూచించారు.మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. శబ్దం అలవాటైందని మనం అనుకోవచ్చు. ఇంటి పక్కన విమానాశ్రయం ఉండటంతో ఇలా జరిగిందనుకున్నా. కానీ, బయాలజీ కథ వేరు.”మీరు మీ చెవులను ఎప్పుడూ మూసుకోరు, నిద్రపోతున్నప్పుడు కూడా మీరు శబ్దాలు వింటారు. అందుకే నిద్రలో కూడా మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది” అని ప్రొఫెసర్ క్లార్క్ తెలిపారు.
శబ్దం ఒక అవాంఛిత ధ్వని. మనకు రవాణా(ట్రాఫిక్, రైళ్లు, విమానాలు) ప్రధాన వనరే. అలాగే, ప్రజలు ఆనందిస్తున్న ధ్వనులు కూడా అంతే. అయితే, ఒక వ్యక్తి సరదా పార్టీ మరొకరికి అతిధ్వనిగా ఉంటుంది.యూరప్‌లో ప్రతి సంవత్సరం 12,000 అకాల మరణాలకు శబ్దం కారణమవుతోంది. ఇది లక్షలాది మంది నిద్రలేమికి, తీవ్రమైన శబ్ద చికాకుకు కారణమవుతుంది, ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
బార్సిలోనాలో ఒక చిన్న పార్కు పక్కన ఉన్న కేఫ్‌లో డాక్టర్ ఫోరాస్టర్‌ను కలిశాను. ఇక్కడ ట్రాఫిక్ శబ్దం 60 డెసిబుల్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉందని నా సౌండ్ మీటర్ చూపించింది.వాస్తవానికి, 500 కంటే ఎక్కువ ఏరియాలు సృష్టించాలనేది అసలు ప్రణాళిక. వీటినే సూపర్‌బ్లాక్‌లుగా చెప్పారు. ఇవి పాదచారులకు అనుకూలమైన జోన్లు, వివిధ నగర బ్లాక్‌లను కలపడం ద్వారా ఏర్పడతాయి.డాక్టర్ ముల్లర్ పరిశోధన ప్రకారం.. నగరంలో శబ్ద తీవ్రతను 5-10 శాతం తగ్గించడం వల్ల ప్రతి సంవత్సరం 150 అకాల మరణాలను నివారించవచ్చు. కానీ, వాస్తవానికి ఆరు సూపర్‌బ్లాక్‌లు మాత్రమే నిర్మించారు. దీనిపై స్పందించడానికి సిటీ కౌన్సిల్ నిరాకరించింది.పట్టణాలు విస్తరించే కొద్దీ శబ్ద కాలుష్యం తీవ్రమవుతోంది. ఎక్కువ మంది నగరాలకు తరలివెళుతున్నారు, దీనివల్ల అవి మరింత శబ్దంతో నిండిపోతున్నాయి.ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా సిటీలలో ఢాకా ఒకటి. ఈ వేగవంతమైన ఎదుగుదల ట్రాఫిక్ పెరుగుదలకు దారితీసింది. నగరాన్ని నిరంతరం హారన్ మోతలతో నింపేసింది.శబ్ద తీవ్రతను తగ్గించడానికి అవగాహన ప్రచారాలు చేస్తున్నారు, అనవసరంగా హారన్ మోగించడంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.