సినిమా ఇండస్ట్రీలో సహజంగానే నటీనటుల మధ్య స్నేహ బంధాలు ఏర్పడతాయి. ఒకే సినిమాలో కలిసి పనిచేసే సమయంలో స్నేహం పెరిగి, కొన్నిసార్లు ప్రేమగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్, టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల మధ్య అలాంటి రిలేషన్ ఉందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో వీరిద్దరూ బాలీవుడ్ లో ఒక సినిమాలో జంటగా నటించబోతున్నారని టాక్.
సంగీత నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో హిట్ ఫ్రాంచైజీ అయిన ఆశికీ సిరీస్‌లో భాగమా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, కార్తిక్ తల్లి మాలా తివారీ ఇటీవల ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఈ రూమర్స్ మరింత వేడెక్కాయి. ‘మా ఇంటికి మంచి డాక్టర్ చదువుకున్న అమ్మాయి కోడలిగా రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చర్చనీయాంశమయ్యాయి.
ఆసక్తికరంగా, శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆమెను ఉద్దేశించిందేనా? అనే ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. అంతేకాదు, గతంలో కార్తిక్ ఫ్యామిలీ ఓ ప్రైవేట్ ఈవెంట్ నిర్వహించినప్పుడు శ్రీలీల ప్రత్యేక అతిథిగా హాజరై కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇలాంటి పరిణామాల వల్ల, సహజంగానే ఈ జంటపై పుకార్లు ఊపందుకుంటున్నాయి. ఇద్దరూ సినిమాకు సంబంధించి ఎక్కువగా సమయం గడుపుతున్నారని, వారి మధ్య కెమిస్ట్రీ బలంగా ఉందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అయితే వీరి మధ్య నిజంగా ప్రేమ ఉందా లేక కేవలం సహజనటుల మధ్య కలిగే అనుబంధమా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో, హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక రూమర్స్ ఎంతవరకు నిజం అవుతాయో ఈ జంట నుంచి త్వరలోనే అధికారిక క్లారిటీ వస్తుందేమో చూడాలి.
తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో సెటిల్ అయిన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందD అనే సినిమాతో పరిచయం అయింది. ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతానికి హిట్స్ లేకపోయినా ఆమెకు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు వెళ్లింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది. అయితే అలా ఎంపిక అయిందో లేదో వెంటనే ఆమె కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో పడిందని వారిద్దరూ రేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్లో మొదలయ్యాయి. అయితే తెలుగులో ఆమెకు ఇలాంటి డేటింగ్ వార్తలు పెద్దగా రాలేదు. దీంతో ఆమె అభిమానుల సైతం నిజంగానే ఆమె కార్తీక్ ఆర్యన్ ను ఇష్టపడిందేమో అనుకున్నారు.
దాని వెనుక బాలీవుడ్ పిఆర్ స్టెంట్స్ ఉన్నాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ గతంలో ఏ హీరోయిన్తో నటించిన ఆ హీరోయిన్ తో డేటింగ్ అంటూ వార్తలు వచ్చేవి ఇదంతా కేవలం ఆయన నటిస్తున్న సినిమాల మీద క్రేజ్ తీసుకు రావడానికే అని తెలుస్తోంది. దానికి తోడు ఇటీవల జైపూర్‌లో జరిగిన IIFA 2025 కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కొన్ని కామెంట్స్ కూడా వీరి రిలేషన్ కి మరింత ఊతం ఇచ్చేలా చేశాయి. కార్తీక్ ఆర్యన్ తల్లిని మీ కోడలిగా ఓ నటి వస్తే ఇష్టపడతారా అని హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్నించినప్పుడు, ఆమె “మా కుటుంబ డిమాండ్ డాక్టర్ కావడమే” అని సమాధానం ఇచ్చింది, అంటే కార్తీక్ ఆర్యన్ భార్యగా మొత్తం కుటుంబం ఓ డాక్టర్ ని కోరుకుంటున్నట్లు హింట్ ఇచ్చిందన్నమాట. శ్రీ లీల డాక్టర్ కావడంతో ఆమె గురించే మాట్లాడిందని అందరూ అనుకున్నారు. .