టాలీవుడ్ లో హిట్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీలీల. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇక మొదటి సినిమాకు సంబంధించి అనేక రకాల గాసిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లవ్ రూమర్స్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అమ్మడికి షూటింగ్ లోనే ఒక చేదు అనుభవం ఎదురైంది.తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోయిన్‌గా ఇమేజ్, బ్రాండ్ సొంతం చేసుకొన్న తార శ్రీలీల. గతంలో శ్రీదేవీ తరహాలో వరుస విజయాలు, ఆఫర్లతో దూసుకెళ్లింది. టాప్ హీరోలందరి సరసన నటించిన ఘనతను సొంతం చేసుకొన్నది. చిన్న హీరోలు, అగ్ర హీరోలందరి సరసన జత కడుతూ ప్రస్తుతం బాలీవుడ్ రంగంలోకి ప్రవేశించింది. హిందీ సినిమా పరిశ్రమలో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్నసినిమాలో కార్తీక్ ఆర్యన్‌తో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగులో ఆమెకు ఎదురైన చేదు అనుభవం వివరాల్లోకి వెళితే..
ఆమె “ఆశికీ 3” అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా.. షూటింగ్ జరుగుతున్న సమయంలో డార్జిలింగ్ లో ఓ అభిమాని వల్ల ఇబ్బందులకు గురయ్యారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియోలో.. జనసందోహం మధ్య శ్రీలీలను ఓ వ్యక్తి ఆకస్మికంగా పట్టుకొని ఆమెను లాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంఘటనతో అక్కడే ఉన్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.శ్రీలీల అసహాయంగా ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన వీడియో క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక ప్రముఖ నటిని పబ్లిక్‌లో ఇలా హ్యారాస్ చేయడమేంటని, ఆమె భద్రతపై ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఓ ఫేమస్ యాక్ట్రెస్ గా ఉన్న సమయంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా షూటింగ్ చేస్తున్నారన్నదే అందరిలో ఆగ్రహానికి కారణమవుతోంది.
దీనిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించకపోయినా, అభిమానులు మాత్రం శ్రీలీలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సంఘటనపై బాలీవుడ్ నెటిజన్లతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిర్లక్ష్యంగా ఉంటే రేపటి రోజు ఇంకా ఎక్కువ స్టౌయిలో జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో ఇండస్ట్రీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.ఇదిలా ఉండగా, శ్రీలీల ప్రస్తుతం తెలుగు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. “ఆశికీ 3” సినిమాతో ఆమె హిందీలో సాలీడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కానీ ఇదే సమయంలో ఆమెకు జరిగిన ఈ సంఘటన ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం స్పందించి భద్రతను పెంచే చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.