Sreeleela: శ్రీ లీల గుంటూరు కారం సినిమా తర్వాత ఈమె నటించిన ఏ సినిమాలు తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ ఇటీవల పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే త్వరలోనే ఈమె నటించిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కాబోతోంది.
గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఒకవైపు నితిన్ మరోవైపు శ్రీ లీల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యం కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని పాట షూట్ చేసే సమయంలో రష్మికను చూసి నేను కాస్త ఇబ్బంది పడ్డాను ఆమెతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు.
నిజానికి రాబిన్ హుడ్ సినిమాలో మొదట రష్మిక ఫైనల్ అయ్యారు ఈమెకు సంబంధించి కొన్ని సన్నివేశాలను షూట్ కూడా చేశారు కానీ రష్మిక తప్పుకోవడంతో ఆస్థానంలోకి శ్రీ లీల ఎంట్రీ ఇచ్చారు దీంతో రష్మికను చూడగానే తనకు మాట్లాడటానికి కాస్త ఇబ్బంది కలిగిందని తెలియజేశారు అయితే స్వయంగా రష్మిక ఈ సినిమా గురించి మాట్లాడుతూ నాకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల సినిమా నుంచి తప్పుకున్నానని తెలపడంతో నాకు కాస్త రిలీఫ్ అయింది.
ఇలా రష్మిక చెప్పిన తర్వాత తనతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యానని మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాము అంటూ తెలియచేశారు.రాబిన్ హుడ్ లో తన క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుందంటూ తెలిపింది ఈ అందాల భామ. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీలకు మళ్లీ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ శ్రీ లీల కెరియర్ కు ఎంతో ముఖ్యమని చెప్పాలి.