RRR ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి వరల్డ్ సినీ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు స్టార్ హీరోల కలయికలో ఈ సినమా చేయడం, దానికి ఆస్కార్ దక్కడం.. అంతే కాకుండా వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ప్రత్యేకంగా జక్కన్నను అభినందించి ప్రశంసల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా రాజమౌళి ప్రపంచ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యారు. దీంతో ఆయన సెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది.
RRR తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్‌తో ఓ భారీ ప్యాన్ వరల్డ్ ఫిల్మ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా SSMB29ని జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మిగతా ప్రాజెక్ట్‌లతో పోలిస్తే రాజమౌళి SSMB29ని శరవేగంగానే పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జక్కన్న, మహేష్‌ల కలయికలో తొలి ప్రాజెక్ట్ కావడం, RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
దాంతో జక్కన్నపై సహజంగానే ఒత్తిడి మొదలైంది. RRR లాంటి సినిమాని అందించి ఆర్శ్యర్య పరిచడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లకు మించిన సినిమాలని జక్కన్న అందించిన నేపథ్యంలో మహేష్‌తో చేస్తున్న SSMB29 అంచనాలకు మించి ఉండబోతోందని, రాజమౌళి ఈ సారి అంతకు మించిన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయబోతున్నారనే టాక్ మొదలైంది. RRR ఆస్కార్ సాధించిన నేపథ్యంలో రాజమౌళి చేస్తున్న SSMB29 పై వరల్డ్ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జక్కన్న అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జక్కన్న ఇంకా సౌండ్ పెంచాల్సిందేననే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. తన ప్రతి ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు మీడియాతో చెప్పి మరీ బరిలోకి దిగే జక్కన్న ఈ సారి ఎందుకో ఆ విషయంలో జాగ్రత్తలు పడుతున్నాడని, దీనికి లీకులు కూడా ఓ కారణం అనే టాక్ ఫిలిం సర్కాల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తనపై గ్లోబల్‌గా పెరిగిన అంచనాలని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి జాగ్రత్తపడుతున్నాడని, ఆ కారణంగానే మీడియా ముందుకురాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల చివరి వారంలో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు విషయాల్ని వెల్లడించబోతున్నారట. ఈ సమావేశం నుంచే జక్కన్న సౌండ్ పెంచబోతున్నారని ఇన్ సైడ్ టాక్!