సానుకూల వాతావరణం లో చర్చించుకుందాం — నీటి వివాదాలు పరిష్కరించుకుందాం.
— మూడు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రుల ఏకాభిప్రాయం.
కేంద్ర జలశక్తి సంఘం ఆధ్వర్యంలోని అఖిలభారత స్థాయి ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు నిమ్మల రామానాయుడు,డీకే శివకుమార్,ఉత్తమ కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు.
** ఆంధ్రప్రదేశ్ కు ఒకవైపు కర్ణాటక, మరోవైపు తెలంగాణ సరిహద్దుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 రాష్ట్రాల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
** ఎవరు నష్టపోకుండా మూడు రాష్ట్రాల రైతులు శ్రేయస్సు కోసం సమిష్టి నిర్ణయాల ద్వారా, సంప్రదింపుల ద్వారా కలసి కృషి చేద్దాం అన్నారు.
** తుంగభద్ర నీటి నిల్వ, పూడిక వంటి అంశాలతో పాటు ఇతర అంశాలు చర్చకు వచ్చాయి.
** ఈ సందర్భంలో రామానాయుడు మాట్లాడుతూ, ఈ ఏడాది నీటిని కాకుండా, గత పది సంవత్సరాలుగా కృష్ణానదికి వస్తున్న నీటిని చూడాలని వారి దృష్టికి తీసుకెళ్ళారు.
** కృష్ణా నది దిగుకు నీరు రావడం కష్టమవుతుందని ఆల్మట్టి,నారాయణపూర్, జూరాల వంటి ప్రాజెక్టులు నిండితేనే, కిందకు నీరు వస్తుందని రామానాయుడు వివరించారు. ఈ దశలో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయికట్టులకు నీరందించడం కష్టంగా మారిందని నిమ్మల వివరించారు.
** అలాగే శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. తద్వారా ఇరు రాష్ట్రాల రైతులకు ఎటువంటి పంట నష్టం, తాగు నీటి ఇబ్బంది లేకుండా జూన్ వరకు ప్రణాళిక బద్దంగా పరస్పర అంగీకారంతో పనిచేయాలనుకున్నారు.
** తుంగభద్ర రిజర్వాయర్ పూడిక తీతకు ప్రత్యామ్నాయంగా చేపట్టవలసిన చర్యలు గురించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏపీ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కలుస్తానని కోరారు. ముందు తగు ప్రతిపాదనలతో అధికారుల స్థాయిలో చర్చించి ఆ తదుపరి ముఖ్యమంత్రిని కలవొచ్చని ఆయనకు సూచించారు
అలాగే 2025 డిసెంబర్ నాటికి డయా ఫ్రంవాల్ నిర్మాణం, 2027 డిసెంబర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు అధికారులు, ఏజెన్సీలతో సిఎం రివ్యూలు చేస్తున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు కూడా ఇప్పటికే రెండు కట్టర్లతో మొదలయ్యాయని, మార్చి నుండి మూడో కట్టర్ తో పనులు మొదలుపెడతామని చెప్పారు. డివాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టే విధంగా సహాయ సహాకారాలు అందించాలని కోరారు. గ్యాప్-1 లో ఇప్పటికే డివాల్ నిర్మాణం పూర్తయ్యిందని, ఈసిఆర్ఎఫ్ నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వివరాలను ప్రతినెలా, కేంద్రానికి తెలియచేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అందుకుగానూ, ప్రతి నెలా కేంద్రానికి పనుల వివరాలు పంపిస్తామని తెలిపారు.