సోషల్ మీడియా యుగంలో ముక్కు ముఖం తెలియని వాళ్లు కూడా ఎంతో పాపులరైపోతున్నారు. మోడలింగ్ నుంచి నటనా రంగంలోకి అడుగు పెట్టాలనే కుతూహాలంతో చాలా మంది వేడెక్కించే ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు. అలాంటి భామల్లో ఒకరు తానియా ఛటర్జీ. ఈ మోడల్ చాలా వాణిజ్య ప్రకటనల్లో, అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది.22 డిసెంబర్ 1994న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన తానియా సోషల్ మీడియా క్వీన్ గా మాత్రమే అందరికీ గుర్తుంది. ఈ భామ వేడెక్కించే ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తూ నిరంతరం డిబేటబుల్‌గా మారుతోంది.
తానియా ఆరంభం హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఉత్పత్తులకు ప్రచారం చేసింది. అటుపై ఉల్లులో వెబ్ సిరీస్ ‘గాంధీ బాత్’లో తన పాత్ర తో పాపులరైంది. అప్పటి నుండి భారతీయ వినోద పరిశ్రమలో కెరీర్ బండిని నడిపించేస్తోంది. తానియాకు మోడలింగ్, నటనలోకి వెళ్లేందుకు కుటుంబం నుంచి కావాల్సినంత సపోర్ట్ ఉంది. గాంధీ బాత్ తర్వాత ‘5 స్టార్ పతి మేరా’ ఎపిసోడ్‌లో చందానిగా తనదైన నటనతో మెప్పించింది. ఈ పాత్ర డిజిటల్ వినోద ప్రపంచంలో తానియాకు నాంది పలికింది. తర్వాత ఉల్లూ ‘కసక్’ ,’టిట్లియాన్’ సహా పలు వెబ్ సిరీస్‌లలో నటించింది. అమీ జే కే తోమర్ (2017) .. భోబిష్యోటర్ భూత్ (2019) వంటి చిత్రాలలో కూడా నటించింది.
అదంతా అటుంచితే తానియా ఇన్ స్టా రీల్స్ చూసిన వారంతా షాక్ కి గురవుతున్నారు. ఈ బ్యూటీ బాతింగ్ సన్నివేశాలు… ఓపెన్ టాప్ దృశ్యాలు సహా ప్రతిదీ ఎంతో అసభ్యకరంగా, టూమచ్ గా కనిపిస్తున్నాయని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా యాక్ట్ తో డీగ్రేడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా సోషల్ మీడియా రెవెన్యూ కోసం తానియా ఆడుతున్న నాటకం అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఈ భామకు నటిగా ఎదిగేందుకు ఛాన్స్ లేదు. అందుకే సంపాదన కోసం ఇలా తెగిస్తోందని విమర్శిస్తున్నారు. సెన్సేషన్ కోసం ఇంతగా తెగించాలా? అని కూడా నెటిజనులు ఫైరవుతున్నారు.
https://www.instagram.com/reel/DHvVFhfBN2J/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==