AP: ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక చివరికి జనసేన పార్టీ అలాగే బిజెపితో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు అయితే వీరీ ప్రయత్నం ఎంతో విజయవంతమైందని చెప్పాలి ఇక ఈ కూటమిలో భాగంగా సీట్లు కేటాయింపు విషయంలో ఎంతోమంది సీనియర్లను చంద్రబాబు నాయుడు దూరం పెట్టాల్సి వచ్చింది.
వీరందరూ కూడా పార్టీ కష్ట సమయంలో పార్టీ వెంటే ఉంటూ కష్టపడుతూ తిరిగి పార్టీని నిలబెట్టారు అలాంటిది పొత్తులో భాగంగా వారికి టికెట్లను దూరం చేశారు అలాంటి వారిలో బోండా ఉమా బుద్ధ వెంకన్న పిఠాపురం వర్మ యనమల రామకృష్ణుడు వంటి వారు చాలామంది ఉన్నారు. ఇక వీరందరికీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీల ద్వారా క్యాబినెట్ లోకి తీసుకుంటాను అంటూ హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.
అయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సీనియర్లకు ఎక్కడా కూడా చోటు కల్పించలేదు అలాగే సిట్టింగ్లకు కూడా గట్టి షాక్ ఇస్తూ ఊహించని విధంగా అభ్యర్థుల పేర్లను చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ క్రమంలోనే చంద్రబాబు ఆలోచన విధానం ఏంటి అంటూ నేతలందరూ తలలు పట్టుకుంటున్నారు.
ఇలా చంద్రబాబు నాయుడు సిట్టింగులను అలాగే సీనియర్లను కూడా కాదంటూ ఎమ్మెల్సీలను కేటాయించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి అంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా ఎంతో మంది సీనియర్లు తమకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తూ వచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి కూడా దాదాపు ఏడాది అవుతున్న ఇప్పటివరకు సీనియర్లను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టడంతో సీనియర్లలో కూడా కాస్త అసహనం మొదలైంది అని తెలుస్తోంది.