హైదరాబాద్‌లో ఆర్ధిక ఇబ్బందులతో ఓ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రైవేట్ కరాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే చంద్రశేఖర్ రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని చంపి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కొన్ని నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుంగిపోయిన చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోడానికి భార్యను ఒప్పించి పిల్లలకు విషం ఇచ్చి చంపేసి భార్యతో కలిసి ప్రాణాలు విడిచాడు.
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన కె.చంద్రశేఖర్రెడ్డి హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. భార్య కవిత(35), పిల్లలు శ్రీతా(15), విశ్వంత్(10)లతో కలిసి హబ్సిగూడలోని మహేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నారు. కవిత గృహిణి కాగా కుమార్తె శ్రీతా తొమ్మిదో తరగతి, కుమారుడు విశ్వంత్ ఐదో తరగతి చదువుతున్నారు. ఏడాాదిగా హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. మరో దారి లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖ రాసి పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చంద్రశేఖర్ రెడ్డి కొంతకాలం ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఆర్నెల్ల క్రితం మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో వీరి కుటుంబంఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సోమవారం కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషం ఇచ్చి, కుమార్తె శ్రీతరెడ్డి ఉరేసి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత భార్య కవితతో కలిసి చంద్రశేఖర్రెడ్డి ఉరి వేసుకున్నారు. ఓయూ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చంద్రశేఖర్ రెడ్డి సూసైడ్ నోట్‌లో తన చావుకి ఎవరు కారణం కాదని పేర్కొన్నారు. వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశారు. ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించాలని, కెరీర్‌లో, శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వివరించారు. మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు సూసైడ్ నోట్‌లో వివరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా విషాదకర ఘటనలు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోగా.. తమిళనాడులోనూ అంతే విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో మరో కుటుంబం తన జీవితాన్ని కోల్పోయింది. అధికార యంత్రాంగం, పోలీస్ శాఖలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
ఇటువంటి ఘటనలు సమాజంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక స్థిరత్వానికి, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరింత అవగాహన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.