ఓవర్ నైట్ లో స్టార్ అయింది ట్రిప్తి దిమ్రీ. అంతకుముందు ఐదేళ్ల పాటు చాలా స్ట్రగుల్ ఎదురైనా కానీ, ఒకే ఒక్క సినిమా తన ఫేట్ మార్చేసింది. యానిమల్ లో రణబీర్ సరసన అతిథి పాత్రలో కనిపించినా ప్రభావవంతమైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ట్రిప్తి వరుసగా పది సినిమాలకు అడ్వాన్సులు అందుకుంది. ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలు వేగంగా పూర్తవుతున్నాయి. ఇవన్నీ 2025-26లో విడుదల కావాల్సి ఉంది. తాజాగా ట్రిప్తి దిమ్రీ ఓ సినిమా సెట్ నుంచి బైక్ పై వెళుతూ సింపుల్ గా కనిపించింది. నిజానికి ట్రిప్తి ఇండస్ట్రీకి రాక ముందే స్థితిమంతురాలు. ఆరేళ్లుగా సినీపరిశ్రమలో ఉన్నా 2023 బ్లాక్ బస్టర్ యానిమల్ తోనే తన ఫేట్ మారింది. ప్రస్తుతం తన నికర ఆస్తి విలువ 30 కోట్లు. ఒక్కో సినిమాకి కోటి నుంచి 3 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటుంది. ఒక్కో ఇన్ స్టా యాడ్ పోస్ట్ కి 80 వేలు అందుకుంటోంది. ఆదాయం దండీగా ఉంది. అయినా తను చాలా సింపుల్ గా ఉండటానికే ఇష్టపడుతుంది. సహజంగానే స్టార్ డమ్ చిక్కాక పెద్ద స్టార్లతో పోటీపడుతూ స్టాటస్ ని ప్రదర్శిస్తూ లగ్జరీ కార్లలో షికార్ చేసేందుకు ఇష్టపడతారు. కొందరు స్టార్లు అయితే తనను లొకేషన్ నుంచి డ్రాప్ చేయడానికి ఖరీదైన కార్ ని ఏర్పాటు చేయాలని కూడా పట్టుబడుతుంటారు. కానీ ట్రిప్తి అవేవీ లేకుండా ఒక బైక్ పై సింపుల్ గా వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ముంబై స్టిల్ ఫోటోగ్రాఫర్లు సోషల్ మీడియాలలో షేర్ చేసారు.
ఇటీవల కాస్మో ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రిప్టి సింప్లిసిటీ గురించి మాట్లాడింది. ముఖ్యంగా తాను చిన్నప్పుడు ఎలా పెరిగిందో వెల్లడించింది. బాల్యంలో ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకూ ఆటలాడుకునేదానిని అని ట్రిప్తి చెప్పింది. అలాగే తనకు పల్లెటూరి మట్టివాసన తెలుసు అని, వాగు వంకల్లో షికార్లు చేసానని కూడా ట్రిప్తి చెప్పింది. నేను గ్రామంలో పిల్లలతో ఆడుకునేదానిని. వాగులో నీటిని తాగేదానిని. అమ్మ మిట్టి (తడి బురద)తో ఇంటిని శుభ్రం చేయడం చూసాను. నేను అక్కడ కూర్చుని మట్టి వాసనను పీల్చుకునేదానిని.. కొన్నిసార్లు మట్టి కూడా తిన్నాను! అని తెలిపింది. ప్రకృతితో తన సహజీవనం గురించి ట్రిప్తి మురిపెంగా చెప్పుకొచ్చింది. నగర జీవనం కంటే పల్లెటూరిలో సహజసిద్ధమైన జీవితాన్ని ఆస్వాధిస్తానని ట్రిప్తి వెల్లడించింది.
ఉత్తరాఖండ్‌లోని ప్రశాంతమైన కొండల నుండి ముంబైలోని సందడిగా ఉండే ఫిల్మ్ సెట్‌ల వరకు ట్రిప్టి ప్రయాణం ఎంతో ఆసక్తికరం. తన పహాడీ వారసత్వం విలువల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ధడక్ 2 సహా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో ట్రిప్తి నటిస్తోంది. కానీ దురదృష్టవశాత్తూ `ఆషిఖి 3`లో నటించే అవకాశాన్ని ట్రిప్తి కోల్పోయింది.