రెండు దశాబ్దాలకు పైగా సౌత్ సినిమాని ఏలిన త్రిష ఇప్పటికీ అగ్ర నాయికగా కెరీర్ రన్ కొనసాగిస్తోంది. అయితే తన స్నేహితురాలు ఛార్మి కౌర్ మాత్రం నటనకు దూరమై, ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. గ్రేట్ ఫ్రెండ్స్ త్రిష- చార్మి మధ్య స్నేహబంధం కాలపరీక్షను తట్టుకుని నిలబడటం చర్చగా మారింది.త్రిష ఎంత పెద్ద స్టార్ అయినా తన స్నేహితులను అస్సలు విడిచిపెట్టరనడానికి ఇది ఒక ఉదాహరణ. చాలా మంది సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నా.. ఏళ్లతరబడి కొద్దిమందితో మాత్రమే సన్నిహిత బంధాన్ని కొనసాగించగలరు. అటువంటి శాశ్వత స్నేహం త్రిషకు నటి చార్మీ కౌర్‌తో ఉంది. ఇటీవలి ఎగ్జయిటింగ్ ఇన్‌స్టా పోస్ట్ దీనికి ప్రూఫ్.
నిజానికి తమిళం నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చారు ఛార్మి. `కాదల్ అళివతిల్లై`లో సింబు సరసన తమిళంలోకి అడుగుపెట్టిన చార్మీ తరువాత `కాదల్ కిసు కిసు`లో కనిపించారు. తరువాత టాలీవుడ్‌పై దృష్టి సారించి ఇక్కడ ఛార్మి అగ్రనటిగా స్థిరపడ్డారు. తరువాత నిర్మాతగాను మారారు. ఈ ప్రయాణం ఎలా ఉన్నా కానీ త్రిషతో ఛార్మి వ్యక్తిగత బంధం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్నేహం కాల పరీక్షను తట్టుకుని నిలిచిందంటూ చర్చ సాగుతోంది.ఇటీవల త్రిష – చార్మి చాలా కాలం తర్వాత తిరిగి కలిశారు. ఇద్దరూ తమ రీయూనియన్ సెలబ్రేషన్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోల రూపంలో షేర్ చేసారు. 20 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ వారి స్నేహం ఎలా బలంగా ఉందో వారి పోస్ట్‌లలో కనిపిస్తోంది. `20 సంవత్సరాల తర్వాత కూడా మా స్నేహం బలంగానే ఉంది` అని ఛార్మి తన పోస్ట్ లో రాశారు, దీనికి త్రిష కూడా ఆనందం వ్యక్తం చేసారు. ఈ అపురూపమైన స్నేహితుల మాటలు అభిమానుల హృదయాలను తాకాయి. నిరంతరం మారుతున్న ఇండస్ట్రీ స్నేహాల విలువను ఈ పునఃకలయిక హైలైట్ చేసింది.
ప్రస్తుతం ఛార్మి- త్రిష జోడీ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు వారి అవినాభావ బంధాన్ని ప్రశంసిస్తున్నారు. సంబంధాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోయే పరిశ్రమలో త్రిష – చార్మి స్నేహానుబంధం అందమైన ఉదాహరణగా నిలుస్తుంది. రెండు దశాబ్దాల తర్వాత కూడా ఒకరిపై ఒకరు నిజమైన స్వచ్ఛమైన ప్రేమ, అభిమానాలను ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంటోంది. నిజమైన స్నేహం కాల పరీక్షను తట్టుకోగలదని అభిమానులకు గుర్తు చేసింది.