టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తన తండ్రి ప్రమేయం లేకుండానే ఇండస్ట్రీలో తన నటనను నిరూపించుకుంటూ నటుడిగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక నటన విషయంలో రామ్ చరణ్ తండ్రికి మించిన తనయుడు అని చెప్పాలి. చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోగా రాంచరణ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు.
ఇక చరణ్ గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ డైరెక్షన్లో నటించబోతున్నారు.
ఇలా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో విభిన్న పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న చరణ్ ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలను పోషించారు. అయితే చరణ్ గురించి ఆయన నటించే పాత్రల గురించి తన భార్య ఉపాసన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారని తెలుస్తుంది. చరణ్ నటించిన సినిమాలన్నీ తనకు చాలా ఇష్టమని ఉపాసన తెలియజేశారట.
ఇక చరణ్ ఇప్పటివరకు హీరోగా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించే సక్సెస్ అందుకున్నారు అయితే ఒక్కసారైనా చరణ్ ని నెగిటివ్ షెడ్ లో చూడాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయట పెట్టినట్లు తెలుస్తుంది. ఇలా నెగిటివ్ పాత్రలో చరణ్ నటించి సక్సెస్ అయితే ఆయన నటుడిగా పూర్తి సక్సెస్ సాధించినట్లేనని ఉపాసన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట మరి తన భార్య కోరిక మేరకు చరణ్ ఒక సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తారా తన భార్య కోరికను తీరుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.