టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కొణిదెల రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. భారీ సంపదను ఎలా ఎదుర్కోవాలి? తనను తాను ఎలా ఎడ్యుకేట్ చేసుకోవాలి అనే విషయాలపై మాట్లాడిన ఉపాసన తాను ఇంట్లోనూ, వర్క్ లోనూ లైంగిక వివక్షను అనుభవించినట్టు తెలిపింది.
అందుకే ప్రొఫెషనల్ గా అందరికంటే ఓ అడుగు ముందుండాలని డిసైడయ్యానని చెప్తోన్న ఉపాసన తమ ఫ్యామిలీ.. సంపద విషయంలో రాజ్యాంగంను ఫాలో అవుతుందని తెలిపింది. తన లైఫ్ చాలా ఆర్గనైజింగ్ గా ఉంటుందని, దానికి కారణం తాను ప్రతీ అంశాన్ని నోట్ చేసుకుని, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కనుక్కొని, దాంతో సంతోషంగా ఉన్నానో లేదో చెక్ చేసుకుంటానని, అప్పటికీ తనకు నమ్మకం కలగకపోతే తనకు ఓ లైఫ్ కోచ్ ఉన్నారని, తన సలహా తీసుకుంటానని ఆమె చెప్పింది.
ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, మనం నాలెడ్జ్ ఎక్కువ సంపాదించుకుంటే నమ్మకం దానంతట అదే వస్తుందని, తన వరకు తాను వీలైనంత నిజాయితీగా ఉంటానని చెప్తున్న ఉపాసన నేర్చుకోవడం చాలా ముఖ్యమని, సంవత్సరంలో మూడు నెలలు తనను తాను అప్డేట్ చేసుకోవడానికే స్పెండ్ చేస్తానని ఉపాసన తెలిపింది. తమ ఫ్యామిలీలో డబ్బు కోసం గొడవలు రాకూడదనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పిస్తూ తన తాత గారు ఫ్యామిలీ రాజ్యాంగంను రూపొందించారని దాని వల్లే తమ ఫ్యామిలీలో ఆస్తుల కోసం ఎప్పుడూ గొడవలు రాలేదని ఉపాసన వెల్లడించింది. ఇక 2012లో రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న ఉపాసన తన భర్త తో ఉన్న బంధాన్ని కూడా వివరించింది.
పెళ్లి అనేది ఆషామాషీ వ్యవహారం కాదని, బిజినెస్ లో ఎలాగైతే రివ్యూలుంటాయో పెళ్లి తర్వాత జీవితంలో కూడా అంతే రివ్యూలు ఉండాలని, అదే పెళ్లి జీవితాన్ని చాలా సంతోషంగా ఉంచుతుందని ఉపాసన తెలిపింది. తామిద్దరూ ప్రతీ వారం డిన్నర్ డేట్ కు వెళ్తామని, ఇద్దరం కూర్చుని అన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకుంటామని చెప్తోన్న ఉపాసన చరణ్ చాలా సెక్యూర్డ్ మ్యాన్, అలాంటి వారే ఆడవాళ్లను సపోర్ట్ చేస్తూ, వాళ్లు మరిన్ని సాధించేలా చేస్తారని అంటోంది. లైఫ్ లో ఎవరికైనా ఒడిదుడికులు సహజమని, ఆ టైమ్ లో ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఎలా తోడుగా ఉన్నారనేది ముఖ్యమని, ఏదైనా సమస్య ఉంటే ఇద్దరం కూర్చుని డిస్కస్ చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవాలని, అదే తమ హ్యాపీ లైఫ్ సీక్రెట్ అని ఉపాసన తెలిపింది