సెలబ్రిటీలు ధనవంతులు కాబట్టి ఖరీదైన కానుకలు ఎన్నయినా ఇవ్వగలరు. కానీ విలువలు, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే అరుదైన కానుకలు ఇచ్చినప్పుడే వాటిని ఎప్పటికీ మరువలేరు. ఉపాసన కామినేని ఇప్పుడు సుస్మిత కొణిదెలకు ఇచ్చిన కానుక అలాంటి అరుదైన కానుక. సుష్మితకు శ్రీరామ పాదాలు పుస్తకాన్ని ఉపాసన బహుకరించారు. సుస్మిత సోషల్ మీడియాలో దీనికి కృతజ్ఞతలు తెలిపారు. `చరణ్ – ఉపాసన..పార్టీకి అద్భుతమైన హోస్ట్‌లుగా ఉన్నందుకు.. చాలా ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు. ఈ బహుమతి మీ ఇద్దరి గురించి చెబుతోంది. సంరక్షణ, తరగతిలో.. మీరు పాటించే విలువల గురించి చాలా మాట్లాడుతుంది` అని రాసారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రామ్ చరణ్ 40వ పుట్టినరోజు వేడుకలను ఉపాసన నిర్వహించిన సంగతి తెలిసిందే..
ఈ వేదిక వద్దనే సుస్మితకు అరుదైన కానుకను ఉపాసన అందించారని భావిస్తున్నారు. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో చరణ్ బర్త్ డే పార్టీ గ్రాండ్ గా జరిగింది. కానీ ఈ బహుమతి ప్రత్యేకంగా నిలిచింది. అత్యున్నత స్థాయి సెలబ్రిటీలలో రెగ్యులర్ గా కనిపించని వ్యక్తిగత, ఆధ్యాత్మిక స్పర్శను ఇది ప్రతిబింబించింది. ఉపాసన చాలా సింపుల్ కానుక ఇచ్చి ఉండొచ్చు.. కానీ ఇది అత్యంత విలువైనది. నిజానికి ఖరీదైన కానుకలను ఎన్నయినా ఇవ్వొచ్చు.. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే జీవిత గమనాన్ని నిర్ధేశించే అరుదైన కానుకలు ఇవ్వడం చాలా ముఖ్యమైనది. అలాంటి ఒక అరుదైన కానుకను ఉపాసన నేరుగా సుస్మితకు ఇచ్చారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే .. రామ్ చరణ్ తదుపరి పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. దీనికి A.R. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను టి సిరీస్ రూ.25 కోట్లకు కొనుగోలు చేసింది. పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఇందులో చరణ్ గెటప్ పైనా చర్చ సాగుతోంది. సుస్మిత మెగాస్టార్ పెద్ద కుమార్తె. నిర్మాతగా టాలీవుడ్ లో బిజీ అవుతున్నారు.