బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్ ఊర్వశి రౌతేలా. ఈ మధ్య కాలంలో ఊర్వశి రౌతేలా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఒక విషయం తర్వాత ఒక విషయం అన్నట్లుగా కంటిన్యూగా ఆమె వార్తల్లో ఉంటుంది. ఆ మధ్య దబిడి దిబిడి సాంగ్‌లోని స్టెప్స్‌కి ఊర్వశి ఎలా ఒప్పుకుంది అంటూ విమర్శలు వస్తే, వాటికి చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చి వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. హిట్ అయిన సినిమాలకే ఇలాంటి విమర్శలు అంటూ ఆ సమయంలో దబిడి దిబిడి సాంగ్ గురించి చెప్పుకొచ్చింది. దాదాపు నెల రోజుల పాటు ఆ విషయమై పతాక స్థాయిలో చర్చ జరిగిన విషయం తెల్సిందే.
తాజాగా మరో వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ… ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ సమీపంలో నా పేరు మీద ఆలయం ఉంది. ఎవరైనా బద్రీనాథ్ వెళ్తే పక్కనే ఉన్న నా ఆలయాన్ని కూడా సందర్శించాలంటూ ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది. ఊర్వశి పేరుతో ఉన్న ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయని ఊర్వశి చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఢిల్లీ యూనివర్శిటీలో స్టూడెంట్స్ నా ఫోటోలకు పూల దండలు వేసి మరీ ఆరాధిస్తారు అని కూడా ఊర్వశి చెప్పుకొచ్చింది. ఊర్వశి సొంత భజన వ్యాక్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆమె వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతున్నారు.
బద్రీనాథ్ సమీపంలో ఉండే బామ్నిలో ఉండే ఊర్వశి ఆలయంను తన ఆలయం అంటూ ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలపై బామ్నికి చెందిన కొందరు స్థానికులు, పురోహితులు స్పందించారు. ఊర్వశి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అసహనం వ్యక్తం చేశారు. బామ్నిలోని ఊర్వశి ఆలయంకు, నటి ఊర్వశికి అసలు సంబంధం లేదని వారు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో హీరోయిన్ తెలివి తక్కువ వ్యాఖ్యలు అంటూ విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో వెంటనే ఊర్వశి నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది. ఆమె టీం నుంచి స్పందన వచ్చింది.
ఊర్వశి వివాదంపై స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఊర్వశి మాట్లాడుతూ… తన పేరు మీద ఆలయం ఉన్నట్లు మాత్రమే చెప్పాను. అది తన ఆలయం అని చెప్పలేదు. అందరూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వీడియోను మరోసారి వింటే అర్థం అవుతుంది. వీడియోను సరిగా చూడకుండానే తప్పుగా అర్థం చేసుకుని, ఒక నిర్ణయానికి రావడం సరికాదంటూ ఊర్వశి చెప్పుకొచ్చింది. ఢిల్లీ యూనివర్శిటీలో ఇప్పటికీ తన ఫోటోలు ఉన్నాయి కావాలంటే చూసుకోవచ్చు అంది. తనను ట్రోల్ చేస్తున్న వారు, తన వ్యాఖ్యలను తప్పబడుతున్న వారు మరోసారి ఆ వీడియోను చూస్తే బాగుంటుంది అంటూ ఊర్వశి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో ఊర్వశి క్లీయర్‌గా తన బద్రీనాథ్ వెళ్లినప్పుడు తన ఆలయం కి వెళ్లమని చెప్పడం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు క్షమాపణలు చెప్పకుండా తన తప్పును తెలుసుకోకుండా మరోసారి తెలివి తక్కువ వ్యాఖ్యలు చేస్తుందంటూ పలువురు ఊర్వశి రౌతేలాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.