43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్ళికి రెడీ అయిన ఫైర్ బ్రాండ్.. ముగ్గురు పిల్లలకు తల్లి..మూడు పెళ్ళిళ్ళు పెటాకులు..
ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి రెడీ కావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రముఖ కొరియోగ్రాఫర్ తో తాను నాలుగవసారి ఏడడుగులు వేయబోతున్నానంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది వనిత. మరి ఈ బ్యూటీ పెళ్లాడబోయేది ఎవరిని? గతంలో జరిగిన మూడు పెళ్లిళ్ల సంగతేంటి? ఈ నాలుగో పెళ్లి ఎప్పుడు జరగబోతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె వనిత. ‘చంద్రలేఖ’ అనే సినిమాతో 1995లోనే ఈ బ్యూటీ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తమిళ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ‘చంద్రలేఖ’ సినిమా ప్లాప్ కావడంతో ఆ తర్వాత ‘మాణిక్యం’ అనే సినిమాలో నటించిన వనిత విజయ్ కుమార్ తెలుగులో ‘దేవి” అనే సినిమాలో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత మరో మలయాళ సినిమాలో మెరిసింది. కానీ చేసిన సినిమాలు కంటే ఎక్కువగా ఈ అమ్మడు వ్యక్తిగత అంశాల వల్లనే వార్తల్లో నిలుస్తుంది.
2000 సంవత్సరంలో నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్ ఒక కొడుకు, కూతురుకి తల్లి అయింది. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా 2005లో ఆకాష్ తో విడాకులు తీసుకుంది. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో పుట్టిన ఇద్దరు పిల్లలే కాకుండా రెండో భర్తతో వనితకు మరో కూతురు పుట్టింది. ఆయనతో కూడా ఐదేళ్ల కాపురం చేశాక 2012లో డివోర్స్ తీసుకుంది. అనంతరం కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో కొన్నాళ్ళ పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అలాంటి టైంలో ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ ని 2020లో పెళ్ళాడి షాక్ ఇచ్చింది. ఆమె మూడో పెళ్లి చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ‘అవసరమైతే నాలుగో పెళ్లి కూడా చేసుకుంటాను’ అంటూ అందరి నోళ్ళు మూయించింది వనిత. కానీ ఈ మూడో పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకుని కేవలం నాలుగు నెలల్లోనే మళ్లీ విడాకులు ఇవ్వడంతో మూడో పెళ్లి కూడా పెటాకులైంది. ఆ తర్వాత వనిత ఆయనతో తనకు అసలు పెళ్ళే జరగలేదని, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.
కోలీవుడ్ నటి వనితా విజయ్ కుమార్ గురించి తమిళ పరిశ్రమలో పరిచయం అక్కర్లేదు. పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఓ సినిమాతో చాలా బిజీగా ఉంది. వనితా మొన్నా మధ్య తెలుగులో వచ్చిన మళ్లీ పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇదిలా ఉంటే వనిత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోస్టులు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
గతేడాది అక్టోబర్ నుంచే వనితా విజయ్ కుమార్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలొస్తున్నాయి. బీచ్ లో వనితా, రాబర్ట్ కు ప్రపోజ్ చేస్తున్నట్టు వచ్చిన ఫోటోను చూసి అందరూ ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిపోయిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన పోస్టర్ అని తెలిసి సైలెంట్ అయ్యారు.
ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వనిత తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమలో పడ్డాం. ఎప్పటికీ కలిసి జీవించాలనే ఆశతోనే పెళ్లి చేసుకున్నాం.. అసలు అరుణ్, విద్య ప్రపంచంలో ఏం జరిగిందంటూ ఓ లవ్ కొటేషన్ ను రాస్తూ సినిమా పోస్టర్ ను షేర్ చేసింది. వనిత ఆ పోస్టర్ ను షేర్ చేసిన కాసేపటికే అది నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ ను చూసిన నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. వనిత మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అని కొందరు అంటుంటే, కాదు అదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని మరికొందరంటున్నారు. మొత్తానికి ఆ పోస్ట్ దేనికి సంబంధించినదైనా సరే వనితా విజయ్ కుమార్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది.
అయితే తాజాగా వనిత తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆ ఫోటోలో ఆమె పెళ్లి కూతురు గెటప్ లో ఉంటే రాబర్ట్ పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నాడు. అది చూసే వనిత నాలుగో పెళ్లికి రెడీ అయిందా అని అందరూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె గతంలో ఆకాష్, రాజన్ ఆనంద్, పీటర్ పాల్ తో పెళ్లి చేసుకుని వారి నుంచి విడిపోయింది. గతంలో వనిత మూడు పెళ్లిళ్లు చేసుకున్నందునే ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లికి రెడీ అయిందేమోననే అనుమానాలొస్తున్నాయి. ఏదేమైనా సినిమా కంటే కూడా ఆమె పెళ్లి మీదే ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది.