ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోనే ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభమేళాకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు అలాగే సెలబ్రిటీలు సైతం ఈ మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే ఈ మహా కుంభమేళాలో చాలామంది సెలబ్రిటీలు మెరిసిన విషయం తెలిసిందే. అన్ని ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కుంభమేళాకు హాజరయ్యి అక్కడ ఉన్న పుణ్య నదుల్లో స్నానం ఆచరించారు.
తాజాగా మరో టాలీవుడ్ హీరో కూడా కుంభమేళాలో ప్రత్యక్షమయ్యారు. మెడ నిండా రుద్రాక్షల మాలతో నీటిలో స్నానం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే.. రుద్రాక్ష మాల, నుదుట తిలకం, కాషాయ వస్త్రధారణలో ఉన్న ఈ హీరో మరెవరో కాదు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తన కుటుంబం, స్నేహితులతో కలిసి కుంభమేళాలో కనిపించారు. అక్కడ పూజలు నిర్వహించడంతోపాటు స్నానాలు కూడా ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ మేరకు ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు. 2025 కుంభమేళా.
స్నేహితులతో జ్ఞాపకాలు, అమ్మతో ప్రార్థనలు అంటూ విజయ్ ఈ ఫోటోలకు క్యాప్షన్ ని జోడించారు. స్టార్ హీరో అయినప్పటికీ పక్కాగా ఆధ్యాత్మిక వస్త్రధారణలో ఆయన కనిపించారు. స్నేహితులతో సరదాగా ఫోటోలు తీసుకున్నారు విజయ్. విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ పై అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది రష్మిక కూడా వచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్ డమ్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. ఇందులో సరికొత్తగా కనిపించారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా విడుదల ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.