విరుష్క జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. విరాట్ ని పెళ్లాడిన నాటి నుంచి అనుష్క సినిమాలు కూడా తగ్గించేసింది. విరాట్ ఎక్కడుంటే? అనుష్క అక్కడ ఉంటుంది. ఏ దేశంలో క్రికెట్ ఆడినా? అక్కడ ఏ క్రికెటర్ భార్య లేకపోయినా? అనుష్క మాత్రం గ్యాలరీ లో కూర్చుని విరాట్ ని ప్రోత్సహిస్తుంది. సిక్సు లు..పోర్లు బాదితే ప్లైయింగ్ కిస్సులిచ్చి మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఇలా ఎంత మంది క్రికెట్ భర్తలకు సాధ్యమవుతుంది.
అంటే అది కేవలం విరాట్ కే సాధ్యమన్నది కళ్ల ముందు కనిపిస్తోన్న వాస్తవం. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ ల్లో భాగంగా అనుష్క హంగామా ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. తాజాగా విరాట్ గురించి భార్యామణి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. `విరాట్ కి భక్తి ఎక్కువ. మ్యాచులు లేనప్పుడు ఆలయాలు చుట్టేస్తాడు. ఉదయం లేవగానే నాతో కలిసి క్రికెట్ ఆడతాడు. ఆహారం విషయానికి వస్తే ఫిట్ నెస్ గురించి నోరు కట్టేసుకుంటాడు.
సాయత్రం ఆరుకు భోజనం చేసి తొమ్మిది గంటలకు పడుకుంటాడు. లండన్ లో ఉంటే పాప వామికను షాపింగ్ కు తీసుకెళ్తాడు. అడిగినవన్నీ కొనిస్తాడు. కానీ నేను అలా కొనొద్దు..డబ్బుతో జాగ్రత్తగా ఉండాలని చెబుతాను. అవసరమైనవి మాత్రమే కొనమని చెప్పి పంపినా? ఇద్దరు నా మాట పెడచెవిన పెట్టి పట్టించు కోరు. కూతురంటే చాలా ప్రేమ. ఎంత మాత్రం రాజీ పడడు. నేను ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటాను. అవసరమైనవే కొంటాను. అనవసరమైన వాటి జోలికి వెళ్లను. ఇది నాకు చిన్న నాటి నుంచి ఉన్న అలవాటు. నా స్నేహితులు కూడా అప్పుడప్పుడు పిసినారి టైప్ అంటారు. లండన్ లో సాయత్రమైతే బాబును ఎత్తుకుని వాకింగ్ కు తీసుకుని వెళ్తుంటారు. తమ్ముడుని ఎలా చూసుకోవాలో వామికకు చెబుతుంటాడు` అని అన్నారు.