చట్టసభల్లో మహిళలకు భాగస్వామ్యానికి కృషి చేస్తున్నాం.
అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు.
నాడు అన్న ఎన్టిఆర్ గానీ, నేడు చంద్రబాబు నాయుడు గానీ నా తెలుగింటి ఆడపడుచులు అని మహిళలను ఎంతో గౌరవించి, వారికోసం దేశంలో ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా సంక్షేమ పధకాలు తీసుకొచ్చారని తెలిపారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గురువారం అమరావతి సచివాలయంలో, ఆంధ్రప్రదేశ్ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపడుచులకు ఆస్దిలో వాటా హాక్కు కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్ ది అని, అదేవిధంగా ద్వాక్రా పధకం ను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందని, 10లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా ఆయా ద్వాక్రా సంఘాలకు బ్యాంకులు అందిస్తున్నాయంటే అదంతా ఎన్టీఆర్, చంద్రబాబు ల కృషే అని తెలిపారు.
ఆర్టిసిలో మహిళలను కండక్టర్లుగా స్దానం కల్పించడంతో పాటు, దేశంలో ఎక్కడా లేని ఎన్నో సంక్షేమ పధకాలు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని, అదేవిధంగా మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు పని చేస్తున్నారని, చట్టసభల్లో కూడా మహిళల భాగస్వామ్యం పెంచేలా ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.