దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత అనంతబాబు వద్ద కారు డ్రైవర్ గా పని చేసిన సుబ్రహ్మణ్యం హత్యకు గురి కావటం.. అతడి శవాన్ని వారి కారులోనే ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లటం అప్పట్లో పెను సంచలనంగా మారింది.దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురికావటం.. దీనికి సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తానే హత్య చేసినట్లుగా ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించటం.. అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్ చేయటం తెలిసిందే. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పై విడుదలైన అనంతబాబు రెండేళ్లుగా బయటే తిరుగుతున్నారు
ఈ హత్య కేసుపై సత్వర విచారణ జరిపి.. నిందితుడికి శిక్ష విధించాలని బాధిత కుటుంబం కోరుతోంది. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకు జరిగిందేమీ లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ కేసుకు సంంధించి అదనపు ఛార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ అయ్యాయి. మర్డర్ కేసుకు సంబంధించిన విచారణ నివేదికను 60 రోజుల్లో జిల్లా ఎస్సీకి.. డీజీపీకి అందజేయాలని పేర్కొన్నారు. అవసరమైతే సంబంధిత న్యాయస్థానం నుంచి అనుమతి పొందిన తర్వాత దర్యాప్తు చేపట్టి.. అదనపు ఛార్జిషీటును కోర్టులో దాఖలు చేయాలన్నారు. 2022 మే 19 రాత్రి ఈ దారుణ హత్య జరగటం తెలిసిందే. వైసీపీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన ఉదంతాల్లో ఇదొకటిగా పేర్కొంటారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. బాధిత కుటుంబానికి పరిహారం అందజేశారు. ఈ కేసును మరోసారి విచారించేందుకు వీలుగా ఆదేశాలు జారీ కావటంతో.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుసుకున్నట్లైందన్న మాట బలంగా వినిపిస్తోంది. విచారణ బాధ్యతను ఐపీఎస్ అధికారికి అప్పగించటం కీలక పరిణామంగా చెబుతున్నారు.
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగాధిపతిగా పనిచేసి, అనంతరం వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయి రెండుసార్లు సస్పెండ్ అయిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అనంతరం క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించిన ఆయనకు నిరాశ ఎదురుకావడంతో స్వయంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీని టార్గెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో గతంలో వైసీపీ హయాంలో తెరపైకి వచ్చిన కేసుల్ని ఒక్కొక్కటిగా టచ్ చేస్తున్నారు.ఇప్పటికే జగన్ కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న బాధితుడు జనిపల్లి శ్రీనివాసరావు కుటుంబాన్ని కలిసి సాయం చేస్తానని హామీ ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళ కాకినాడ వెళ్లి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రమణ్యం కుటుంబాన్ని కలిశారు. అనంతరం వారితో కలిసి ఎస్పీ వద్దకు వెళ్లి ఈ కేసు పునర్ విచారణ చేయాలని కోరారు. గత ప్రభుత్వ బాధితుల పక్షాన అవసరం అయితే ప్రభుత్వ పెద్దలను కలుస్తానని ఏబీ తెలిపారు. వారు స్పందించకపోతే ఆందోళన చేస్తానని వెల్లడించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులను ద్వారంపూడి మెనేజ్ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.
ద్వారంపూడి బియ్యం కేసులో పురోగతి లభించడం లేదన్నారు.వీధి సుబ్రహ్మణ్యం హత్య అత్యంత నీచమైనదని ఆయన తెలిపారు. అనంత బాబుని కాపాడడానికి గత ప్రభుత్వం ఎన్నో అడ్డ దారులు తొక్కిందన్నారు. దర్యాప్తును తూతూ మంత్రంగా చేశారన్నారు. హంతకుడిని ఎలా బయటకు తీసుకురావాలనే చార్జిషీట్ వేశారన్నారు. ముద్దాయి చెప్పిన స్టోరీనే చార్జీ షీట్ లో పెట్టారన్నారు. పాలకుల కనుసన్నల్లో పోలీసులు చార్జీ షీట్ వేశారని ఆరోపించారు. ఏం చేసినా చెల్లుంతుందనే విధంగా జగన్ వ్యవహరించాడని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.