ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈమె కొత్తగా నామకరణం కూడా చేశారు. ఈ సందర్భంగా షర్మిల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ..చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలతో తాను పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ సిద్ధాంతాలు అన్నింటిని పక్కనపెట్టి నరేంద్ర మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శలు కురిపించారు.
RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నాడని ధ్వజమెత్తారు. జనసేన పార్టీని కాస్త ఆంధ్ర మత సేన పార్టీగా మార్చేశారు అంటూ షర్మిల వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వరకు జనసేన పార్టీ జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే మతానికి ఎజెండాగా పనిచేయడం విడ్డూరం అని తెలిపారు.సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రరాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా జనసేన వైఖరి ఉండటం విచారకరం అని తెలిపారు.
పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున తాను పూర్తిగా ఖండిస్తున్నానని వెల్లడించారు.స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకొని వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ పార్టీ స్థాపించాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కొని.. బీజేపీ మైకం నుంచి పూర్తిగా బయటకు వచ్చి ప్రజలకు మంచి చేయాలని ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటూ ఈమె హితబోధ చేశారు.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీని.. ఆంధ్ర మతసేన పార్టీగా మార్చారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కోండి. బీజేపీ మైకం నుంచి బయట పడండి”- వైఎస్ షర్మిల