ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసులో ప్రధాన అప్రూవర్‌గా ఉన్న దస్తగిరికి భద్రతను గణనీయంగా పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దస్తగిరికి 1+1 గన్‌మెన్‌లతో భద్రత ఉండగా.. దాన్ని ఇప్పుడు 2+2 గన్‌మెన్‌ల స్థాయికి పెంచాలని నిర్ణయించినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) సాక్షులు అనుమానాస్పదంగా మరణిస్తున్న నేపథ్యంలో తనకు అదనపు భద్రత అవసరమని జిల్లా ఎస్పీకి దస్తగిరి వినతిపత్రం అందజేశారు. దస్తగిరి వినతిని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు, అతని భద్రతను పెంచాలని నిర్ణయించారు. దీంతో గురువారం సాయంత్రం నుండి ఇద్దరు అదనపు గన్‌మెన్‌లు దస్తగిరి ఇంటి వద్ద విధుల్లో చేరారు. ఇప్పుడు మొత్తం నలుగురు గన్‌మెన్‌లు దస్తగిరికి భద్రతను అందిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకా హత్య కేసు ఆరు సంవత్సరాల తర్వాత కూడా ప్రధానాంశంగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకా హత్య కేసు ఆరు సంవత్సరాల తర్వాత కూడా ప్రధానాంశంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులు వరుసగా మిస్టీరీయస్‌గా మరణించడం గందరగోళం రేపుతోంది. ఈ కేసుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వారు ఇప్పటివరకు మరణించిన వారిలో ఉన్నారు.
* కీలక సాక్షి కె. శ్రీనివాస రెడ్డి (02.09.2019) మరణించారు.
* గంగాధర్ రెడ్డి అనుమానాస్పద పరిస్థితుల్లో (09.06.2022) మరణించారు.
* భారతీ రెడ్డి (ఫిర్యాదు చేసిన వ్యక్తి) తండ్రి డాక్టర్ ఈ.సి. గంగిరెడ్డి అనుమానాస్పదంగా మరణించారు.
ఫిర్యాదుల నమోదులో సహకరించినట్లు భావిస్తున్న జగన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా యువవయసులోనే అనుమానాస్పదంగా మరణించారు.
గత వారంలోనే వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న మరణించాడు.
ఈ నేపథ్యంలో ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి భద్రతను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు శాఖ నిర్ణయించాయి. వివేకా కేసులో గతంలో డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి, అరెస్టయ్యాక అప్రూవర్‌గా మారాడు. ప్రస్తుతం అతడికి 1+1 భద్రత మాత్రమే ఉండగా, తాజాగా చోటుచేసుకుంటున్న అనుమానాస్పద మరణాల దృష్ట్యా పోలీస్ శాఖ అతనికి 2+2 భద్రత కల్పించాలని నిర్ణయించింది. దీంతో అతడికి వెంటనే పెంచిన భద్రత అమల్లోకి తెచ్చారు.