పెనుకొండ లో సాయి కాళేశ్వర్ ఉన్నప్పుడు మంచి క్రేజ్
సేవా కార్యక్రమాలతో గుర్తింపు.
శిల్ప రెండవ పెళ్లి చేసుకున్నా సాయి కాళేశ్వర్ ట్రస్టు అయిన షిరిడీ సాయి గ్లోబల్ ట్రస్టు చైర్మన్ గా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు..సేవా కార్యక్రమాలు సాయి కాళేశ్వర్ ఆశయాలను మరింత విస్తృత పరచాలి అంటే రాజకీయాలే సరైన వేదిక అని నిర్ణయం.త్వరలో వైసీపీ లో చేరి వైసీపీ ఇంచార్జీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే అక్కడ ఇద్దరు మాజీ మంత్రులు శంకర్ నారాయణ , ఉష శ్రీ చరణ్ లు రెండు వర్గాలుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా ఇంచార్జీ గా ఉన్న ఉష శ్రీ చరణ్ ఏమాత్రం ప్రభావం చూపటం లేదనే విమర్శలు ఉండగా కడప అనంతపురం తో సంభందాలు ఉంటూ ఆర్థికంగా బలంగా ఉంటూ స్థానికంగా మంచి Following, ఆర్థికంగా చాలా బలమైన శిల్ప వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నారు. కాగా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ లోనే ఉంటానని శంకర్ నారాయణ చెప్తుండగా మరో మంత్రి మాత్రం బీజేపీ లో చేరి కర్ణాటక నుండి లోక్ సభ కు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది…ఏమైనా శిల్ప వైసీపీ లో చేరితే సరైన ఎంపిక అవుతుంది అని పెనుకొండ వైసీపీ శ్రేణులు అభిమానులు అంటున్నారు.